#KGF,#Pushpa లాగ తీయగలవా అన్నాడా హీరో

 నాలుగున్నర గంటలు కథ విని అబ్బబ్బా అమోఘం,ఇలాంటి కథ వినలేదు ఎప్పుడూ ,అద్బుతం అన్నవాళ్లే తప్పించి, కథ తీద్దాం రండి అని ముందుకు వచ్చేవాళ్లు ఏరి. అందుకు కారణం ఒక ఒరవడి నడుస్తోంది.
 

A notable actor told me that he wanted to do a film like #Pushpa jsp

‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో  విషయం ఉన్న డైరక్టర్ గా  పేరు తెచ్చకున్నారు వెంకటేష్ మహా. లైఫ్ యాంథాలజీ గా వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత సత్యదేవ్ హీరోగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ వంటి డిఫరెంట్ జోనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఆయన సినిమాల కన్నా మాటలు వివాదంగా నిలిచి వార్తలుకు ఎక్కాయి. ఆ మధ్యన  ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని ‘కేజీఎఫ్ 2’ సినిమా అందులో హీరో యష్ పాత్రపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అటు సోషల్ మీడియాలోనూ ఆయనపై ట్రోల్స్ వచ్చాయి. 

 తమలాంటి దర్శకులు తమ అభ్యుదయ భావాలను పక్కనపెట్టి సినిమాలు చేస్తే అంతకంటే గొప్ప సినిమాలు తీయగలం అని అన్నారు. కానీ, తాము అలాంటి సినిమాలు చేయడం లేదని, విలువలతో కూడిన సినిమాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాంటి సినిమాలను కూడా డిగ్రేడ్ చేస్తున్నారని, అవి ఓటీటీ సినిమాలు అని అంటున్నారని వ్యాఖ్యానించారు.  ఇప్పుడు మరోసారి కేజీఎఫ్ ,పుష్ప ప్రస్తావన ఆయన ఇంటర్వూలో వచ్చింది. 

సంపూర్ణేశ్‌ బాబు (Sampoornesh Babu)హీరోగా వెంకటేష్ మహా కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం మార్టిన్‌ లూథర్‌ కింగ్ (‌Martin Luther King). పొలిటికల్‌ సెటైరికల్ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి పూజా అపర్ణా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పూజా అపర్ణా డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తోంది. మార్టిన్‌ లూథర్‌ కింగ్ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సంపూర్ణేశ్ బాబు టీం ప్రమోషన్స్‌తో ఫుల్‌ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆయన ఓ వెబ్ సైట్ కు చెందిన యూట్యూబ్ ఛానెల్ మాట్లాడుతూ తన మనస్సులోని అభిప్రాయాలు,ఆవేదన వెళ్లబుచ్చారు.
 
వెంకటేష్ మహా మాట్లాడుతూ...నేను  బ్రహ్మాండంగా ఆర్బాటంగా కనపడటానికి ఇక్కడికి రాలేదు.  కథలు చెప్పటానికి వచ్చాను.  నా నుంచి ఒరిజనల్ కథలు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు మర్మాణువు అనే సినిమాకోసం క్రౌండ్ ఫండింగ్ చేస్తున్నాను. జనవరి నుంచి ఇప్పటిదాకా 15 నేరేషన్ లు ఇచ్చాను. ప్రతీ నేరేషన్ నాలుగున్నర గంటలు.  ఒక అరగంటలో చెప్పగలిగే కథ కాదు. అలా చెప్తూ వచ్చా. అలా నాలుగున్నర గంటలు కథ విని అబ్బబ్బా అమోఘం,ఇలాంటి కథ వినలేదు ఎప్పుడూ ,అద్బుతం అన్నవాళ్లే తప్పించి, కథ తీద్దాం రండి అని ముందుకు వచ్చేవాళ్లు ఏరి. అందుకు కారణం ఒక ఒరవడి నడుస్తోంది.

 నేను  ప్రముఖ నటుడుకి ఓ లవ్ స్టోరీ చెప్పాను  నేనొక ఒక గుర్తింపు పొందిన ప్రముఖ నటుడికు  ఓ  ప్రేమకథ చెప్పాను. అతను అంతా విని తాను #Pushpa లాంటి సినిమా చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. నా దగ్గర ఉన్న మూడు కథల్లో ఓ యాక్షన్ కథ ఉంది. అది నేను ఒక హీరోకి మరియు అతని టీమ్‌కి చెప్తే...అందరూ  విని    #KGF లాగా ప్లాన్ చేయాలని వారు నాకు సూచించారు. KGF కావాలంటే అదే మళ్లీ చూద్దాము. లేకపోతే ఈ మధ్యన ఓ సాప్ట్ వేర్ వచ్చింది. కాపీ చేయడానికి బదులుగా AIలో #యష్ ముఖం తీసేసి అతని మొహం పెట్టేయచ్చు. చూసుకుంటే సరిపోతుంది కదా ఇంట్లో . ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. నేను కానీ కాంప్రమైజ్ కాదలుచుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు వెంకటేష్ మహా. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios