మీరెప్పుడైనా.. ముగ్గురితో గడిపారా..? హీరోయిన్ కి అసభ్యకర ప్రశ్న

A fan asked Bruna Abdullah if she ever had a threesome - check out her classy response
Highlights

 'మీరు వర్జినా' అని ప్రశ్నించాడు. దానికి ఆమె 'నేను వర్జిన్ కాదు.. స్కార్పియో(వృశ్చికం)' అని బదులిచ్చింది.

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలు అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. వారితో మాట్లాడుతూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసం చాట్ లు నిర్వహిస్తూ తమ విషయాలను షేర్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలకు చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు అభిమానుల నుండి కొన్ని అసభ్యకర ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు.

ఇలా జరిగే సమయంలో కొందరు నటీమణులు కోపం తెచ్చుకోవడం, సదరు నెటిజన్ ని దూషించడం వంటివి చేస్తుంటారు. మరికొందరైతే పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్తారు. తాజాగా ఓ హీరోయిన్ మాత్రం తనకు ఎదురైన కొన్ని అసభ్యకర ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానమిచ్చింది. బాలీవుడ్ హీరోయిన్ బ్రూనా అబ్దుల్లాని ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా.. 'మీరు వర్జినా' అని ప్రశ్నించాడు.

దానికి ఆమె 'నేను వర్జిన్ కాదు.. స్కార్పియో(వృశ్చికం)' అని బదులిచ్చింది. మరో వ్యక్తి 'మీరెప్పుడైనా ముగ్గురితో గడిపారా' అని ప్రశ్నించగా.. 'ముగ్గురితో గడపడం గురించే కదా మీరు అడిగింది. అవును.. నేను గడిపాను. నా ఇద్దరు స్నేహితులతో కలిసి లంచ్ చేస్తుంటాను' అని వెల్లడించింది.

loader