తమిళంలో తెరకెక్కిన '96' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ చెన్నై థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా టీవీలో ఈ సినిమాను టెలికాస్ట్ చేసినా జనాలు థియేటర్లలో చూస్తూనే ఉన్నారు.

మంచి కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిషల నటనకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా రిలీజ్ కాకముందే తెలుగు రైట్స్ ని దక్కించుకున్నాడు నిర్మాత దిల్ రాజు.

ఈ సినిమా తెలుగు రీమేక్ లో నాని, సమంత నటిస్తారనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు నాని వెనక్కి తగ్గుతున్నాడని సమాచారం. ఏ హీరో కూడా ఈ రీమేక్ లో నటించడానికి ముందుకు రావడం లేదు. విజయ్ సేతుపతిలా ఆ పాత్రలో జీవించలేమని కొందరు హీరోలు అనుకుంటుంటే మరికొందరు రీమేక్ సినిమాలో నటిస్తే తమ ఇమేజ్ పై ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందా..? అని ఆలోచిస్తున్నారు.

కొందరు హీరోయిన్లు మాత్రం త్రిష పోషించిన పాత్రలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. సమంత లాంటి హీరోయిన్లు మాత్రం ఈ సినిమాను రీమేక్ చేయకపోవడమే మంచిదని సలహాలు ఇస్తున్నారు. మరి దిల్ రాజు ఈ రీమేక్ ని ఎలా సెట్స్ పైకి తీసుకువెళ్తాడో చూడాలి!