Asianet News TeluguAsianet News Telugu

'96' రీమేక్ : డైరక్టర్ కు, దిల్ రాజు కండీషన్స్

దిల్ రాజు కు తెలుగు సినిమాకు ఏం కావాలో తెలుసు. ఆ విషయం తెలుసు అని ఆయనకు తెలుసు. దాంతో ఆయన చాలా విషయాల్లో దర్శకులతో ఖచ్చితంగా ఉంటారు. తనకు కావాల్సిన విధంగా ప్రాజెక్టుని డిజైన్ చేస్తూంటారు. 

96 Remake: Dil Raju conditions to Director
Author
Hyderabad, First Published Mar 7, 2019, 4:50 PM IST

దిల్ రాజు కు తెలుగు సినిమాకు ఏం కావాలో తెలుసు. ఆ విషయం తెలుసు అని ఆయనకు తెలుసు. దాంతో ఆయన చాలా విషయాల్లో దర్శకులతో ఖచ్చితంగా ఉంటారు. తనకు కావాల్సిన విధంగా ప్రాజెక్టుని డిజైన్ చేస్తూంటారు. అవి కొత్త డైరక్టర్స్ పెద్దగా బాధించవు కానీ ఆల్రెడీ హిట్ లో ఉన్న దర్శకులకు, సీనియర్స్ కు ఇబ్బంది పెట్టే అంశాలు. అలాగని ఆయన మిగతా విషయాలు దేంట్లోనూ వేలు పెట్టరు. ఇప్పుడు 96 రీమేక్ విషయంలో కొన్ని కండీషన్స్ ని డైరక్టర్ కి పెట్టినట్లు సమాచారం. 

విజయ్ సేతుపతి, త్రిష జంటగా తమిళం లో నటించిన చిత్రం 96. ఈ చిత్ర టీజర్ చూసి సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరిలో నమ్మకం కలిగింది. తెలుగు నిర్మాత దిల్ రాజు సైతం ఈ టీజర్ కు ఫిదా అయి వెంటనే ఈ సినిమా రైట్స్ సొంతం చేసుకున్నాడు. అందరూ అనుకున్నట్లే ఈ సినిమా తమిళనాట సూపర్ హిట్ అయి అందరి నమ్మకం నిలబెట్టింది.

ఇక ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించాలని  నాని.. అల్లు అర్జున్.. గోపీచంద్.. ఇలా చాలా మందినే ట్రై చేసి చివరకు శర్వానంద్ ని ఫైనలైజ్ చేసారు. అలాగే త్రిష చేసిన పాత్రకు సమంత అయితే పర్ఫెక్ట్ గా సరిపోతారని రాజు ఫిక్స్ అయ్యారు.  తమిళ వెర్షన్ రూపొందించిన ప్రేమ్ కుమారే తెలుగులోనూ దర్శకత్వం వహించమనిఆఫర్ చేసారు.  అంతవరకూ బాగానే ఉంది. అయితే యాజటీజ్ సినిమాని రీమేక్ చేయటానికి దిల్ రాజు ఒప్పుకోలేదట. తెలుగు నేటివిటికి తగినట్లుగా మార్పులు చేయించారు. అలాగే టైటిల్ సైతం జాను అని పెడదామని ఫిక్స్ అయ్యారట. 

ఇవన్నీ ఇలా ఉంటే   సంగీతం విషయానికి వచ్చే సరికి డైరక్టర్ తనకు తమిళంలో ఇచ్చిన మ్యూజిక్ డైరక్టర్ గోవింద వసంత ను ఫైనల్ చేద్దామంటారు. దిల్ రాజు తెలుగులో టాప్ మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ ని తో చేయిద్దామని ఆలోచన. శర్వానంద్ కూడా దానికే సై అన్నాడు. సమంత కూడా దేవి సంగీతం అంటే సూపర్ అనేసింది. కానీ ఆ విషయంలో మాత్రం డైరక్టర్ కాంప్రమైజ్ కాలేదు. 

చివరకు మిగతా అన్ని విషయాల్లో దిల్ రాజు దే నిర్ణయం ఫైనల్ అని, కేవలం సంగీతం మాత్రం డైరక్టర్ కోరిన సంగీత దర్శకుడుకే ఇవ్వటానికి ఓకే అన్నారట. అయితే ఆ సంగీత దర్శకుడుని  తెలుగు ఆడియన్స్ కు నచ్చే విధంగా కొన్ని మార్పులు తెలుగులో చేయాలని దిల్ రాజు చెప్పారట. ఇలా మరికొన్ని కండీషన్స్ ని డైరక్టర్ కు పెట్టి దిల్ రాజు ప్రాజెక్టుని ఫైనలైజ్ చేసారట.  

Follow Us:
Download App:
  • android
  • ios