Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ లో ఫిల్మ్ ఫేర్ సందడి, రణ్ వీర్,కృతి సనన్ తో పాటు విన్నర్స్ ఎవరెవరంటే...?

బాలీవుడ్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ల పండగ హాడావిడి స్టార్ట్ అయ్యింది. 2021 గాను అద్భుతమైన నటన చూపించిన వారితో పాటు.. ఆడియన్స్ మెచ్చిన సినిమాలను ఫిల్మ్ ఫేర్ వరించింది. మరి ఈ అవార్డ్ గెలుచుకున్న స్టార్స్ ఎవరు...?
 

67th Filmfare Awards ceremony In Bollywood
Author
First Published Aug 31, 2022, 11:16 AM IST

బాలీవుడ్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ల పండుగ జరుగుతోంది. టైమ్స్ గ్రూప్ అందించిన  67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ తో స్టార్స్ మెరిసిపోతున్నారు.  2021లో ఉత్తమ భారతీయ హిందీ-భాషా  సినిమాలు.. ఉత్తమ నటులను అవార్డ్ లు వరించాయి.  వీటికి సంబంధించిన వివరాలను  ఫిల్మ్‌ఫేర్ ఎడిటర్ నేతృత్వంలోని  బృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు.  

ఈ సారి బాలీవుడ్ లో ఎక్కువగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లను కొన్ని సినిమాలు మాత్రమే సాధించాయి.. అన్ని విభాగాల నుంచి షేర్షా, సర్దార్  ఉదమ్ , మిమీ సినిమాలు ఎక్కువ అవార్డ్స్  సాధించాయి. ఉత్తమ నటుడిగా రణ్ వీర్ సింగ్, ఉత్తమ నటిగా కృతి సనన్ ఫిల్మ్ ఫేర్ గెలుచుకోగా.. అన్ని విభాగాల నుంచి అవార్డ్స్ ను ప్రకటించారు. ఇక ఇతర విభాగాల నుంచి అవార్డ్ సాధించిన వారు ఎవరెవరంటే..? 

Popular awards:

ఉత్తమ చిత్రం: షేర్షా (ధర్మ ప్రొడక్షన్స్)
ఉత్తమ దర్శకుడు: విష్ణువర్ధన్ (షేర్షా)
ఉత్తమ నటుడు: కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ (83)
ఉత్తమ నటి: కృతి సనన్, మిమీ రాథోడ్‌గా మిమీ
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమీ)
ఉత్తమ సహాయ నటి: సాయి తంహంకర్ (మిమీ)

Debut Awards

బెస్ట్ డెబ్యూ మేల్    : ఇహాన్ భట్ – జే పాత్రలో 99 సాంగ్స్ 
బెస్ట్ డెబ్యూ ఫీమేల్ : శర్వరీ వాఘ్ – బంటీ ఔర్ బబ్లీ 2 సోనియా రావత్ / జాస్మిన్ “జాజ్” గా
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : సీమా పహ్వా - రాంప్రసాద్ కి తెహ్ర్వి

Writing Awards

ఉత్తమ కథ: అభిషేక్ కపూర్, సుప్రతిక్ సేన్ మరియు తుషార్ పరాంజపే (చండీగఢ్ కరే ఆషికి)
ఉత్తమ స్క్రీన్ ప్లే: శుభేందు భట్టాచార్య మరియు రితేష్ షా (సర్దార్ ఉద్దం)
ఉత్తమ డైలాగ్: దిబాకర్ బెనర్జీ మరియు వరుణ్ గ్రోవర్ (సందీప్ ఔర్ పింకీ ఫరార్)

Music Awards

ఉత్తమ సంగీత దర్శకుడు: తనిష్క్ బాగ్చి, బి ప్రాక్, జానీ, జస్లీన్ రాయల్, జావేద్-మొహ్సిన్ మరియు విక్రమ్ మాంట్రోస్ (షెర్షా)
ఉత్తమ గీత రచయిత: కౌసర్ మునీర్ - "లెహ్రా దో" (83)
ఉత్తమ నేపథ్య గాయకుడు: బి ప్రాక్ - “మన్ భార్య” (షేర్షా)
ఉత్తమ నేపథ్య గాయని : అసీస్ కౌర్ – “రాతన్ లంబియా” (షేర్షా)

Critics’ Awards

ఉత్తమ చిత్రం (ఉత్తమ దర్శకుడు): షూజిత్ సిర్కార్ (సర్దార్ ఉదమ్)
ఉత్తమ నటుడు: విక్కీ కౌశల్ – ఉధమ్ సింగ్ పాత్రలో సర్దార్ ఉదమ్
ఉత్తమ నటి: విద్యాబాలన్ - విద్యా విన్సెంట్ పాత్రలో షెర్నీ

Special Award

ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: సుభాష్ ఘాయ్

Technical awards

ఉత్తమ ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్ (షేర్షా)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: మాన్సీ ధ్రువ్ మెహతా మరియు డిమిత్రి మలిచ్ (సర్దార్ ఉదమ్)
ఉత్తమ కొరియోగ్రఫీ: విజయ్ గంగూలీ - "చక చక్" (అత్రంగి రే)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ (సర్దార్ ఉదమ్)
ఉత్తమ సౌండ్ డిజైన్: దీపాంకర్ చాకి, నిహార్ రంజన్ సమాల్ (సర్దార్ ఉద్దం)
ఉత్తమ నేపథ్య సంగీతం: శంతను మోయిత్రా (సర్దార్ ఉద్దం)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: వీర కపూర్ ఈఈ (సర్దార్ ఉదం)
ఉత్తమ యాక్షన్: స్టీఫన్ రిక్టర్, సునీల్ రోడ్రిగ్స్ (షెర్షా)

Follow Us:
Download App:
  • android
  • ios