త్రీ ఇడియట్స్ ఫేమ్ అఖిల్ మిశ్రా మృతి.. వివరాలు ఇవే..
ప్రముఖ నటుడు అఖిల్ మిశ్రా మృతిచెందాడు. ముంబైలోని తన ఇంట్లోని వంటగదిలో జారిపడటంతో గాయపడి అతడు మృతిచెందినట్టుగా చెబుతున్నారు.
ప్రముఖ నటుడు అఖిల్ మిశ్రా మృతిచెందాడు. ముంబైలోని తన ఇంట్లోని వంటగదిలో జారిపడటంతో గాయపడి అతడు మృతిచెందినట్టుగా చెబుతున్నారు. వంటగదిలో జారిపడటంతో అఖిల్ మిశ్రా గాయపడ్డాడు.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందినట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు తెలిపారు. ప్రస్తుతం అఖిల్ మిశ్రా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టమ్ నివేదికల తర్వాత అఖిల్ మిశ్రా మరణానికి స్పష్టమైన కారణాం తెలియనుంది.
అయితే ఈ ఘటన చోటుచేసుకున్న అఖిల్ మిశ్రా భార్య , నటి సుజానే బెర్నెర్ట్ హైదరాబాద్‌లో ఉన్నారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆమె తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. వెంటనే ముంబైకి బయలుదేరారు.
ఇక, అఖిల్ మిశ్రా 1965లో జన్మించాడు. అతడు.. ఉత్తరన్, ఉడాన్, సిఐడి, శ్రీమాన్ శ్రీమతి, హతిమ్‌తో సహా అనేక ప్రముఖ టెలివిజన్ షోలలో నటించారు. కొన్నేళ్లుగా డాన్, గాంధీ మై ఫాదర్, శిఖర్, 'భోపాల్: ఎ ప్రేయర్ ఫర్ రెయిన్'తో పాటు పలు చిత్రాలలో కూడా కనిపించాడు. అమీర్‌ఖాన్ హీరోగా తెరకెక్కిన 3 ఇడియట్స్ చిత్రంలో లైబ్రేరియన్ దూబే పాత్రలో అఖిల్ నటనకు మంచి గుర్తింపు దక్కింది. అఖిల్ మొదటిగా 1983లో మంజు మిశ్రాను వివాహం చేసుకున్నాడు. 1997లో మంజు మరణించిన తర్వాత.. 2009 ఫిబ్రవరిలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్‌ను వివాహం చేసుకున్నాడు.