ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత భారీ స్థాయిలో రిలీజైన 2.0 సౌత్ సినిమా స్థాయిని పెంచిందనే చెప్పాలి. 450కోట్లకు పైగా ఖర్చు పెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం బాగానే ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదనే టాక్ వచ్చింది. ఇక బాలీవుడ్ లో మంచి లాభాలను అందిస్తున్న సూపర్ స్టార్ సినిమా తెలుగు తమిళ్ లో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ కి చేరుకోలేదు. 

బాలీవుడ్ 175 కోట్లను అందుకొని 200 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవ్వడానికి 2.0 ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ బయ్యర్స్ దాదాపు లాభాల్లో సేఫ్ కాగా తెలుగులో బయ్యర్స్ కి 15% వరకు నష్టాలూ తప్పవనేలా కథనాలు వెలువడుతున్నాయి. తెలుగులో  70+ కోట్లకు అమ్ముడు పోయిన ఈ సినిమా 60 కోట్ల షేర్స్ ను ఇంకా అందుకోలేదని తెలుస్తోంది. 

ఇక దాదాపు తమిళ్ లో కూడా అదే కలెక్షన్స్ అన్నట్లు టాక్. రజినీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ విజువల్ వండర్ 2డి లో పూర్తిగా విఫలమయ్యింది. 3డిలో వీకెండ్స్ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టినప్పటికీ మిగతారోజుల్లో డల్ అయ్యింది. ఇక నెక్స్ట్ వీక్ అన్ని భాషల్లో కొంచెం పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడంతో 2.0 కలెక్షన్స్ పూర్తిగా డౌన్ అయ్యేలా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.