Asianet News TeluguAsianet News Telugu

తరుణ్ చేయాల్సిన నువ్వు నాకు నచ్చావ్ వెంకీ చేతుల్లోకి ఎలా వెళ్ళింది...?

నువ్వు నాకు నచ్చావ్ తెలుగు ఆడియన్స్ ఫెవరేట్ మూవీగా ఉంది. వెంకీ కెరీర్ లో అతిపెద్ద హిట్ గా ఉన్న నువ్వు నాకు నచ్చావ్ చిత్రానికి మొదటి ఆప్షన్ తరుణ్ కావడం విశేషం. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆయన చేతి నుండి ఎలా చేజారిందీ...

21 years for nuvvu naaku nachhav tarun is the first choice not venkatesh
Author
First Published Sep 6, 2022, 6:10 PM IST

వెంకటేష్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయింది నువ్వు నాకు నచ్చావ్. కె విజయ భాస్కర్ డైరెక్షన్, త్రివిక్రమ్ రైటింగ్, కోటి మ్యూజిక్ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాయి. సెప్టెంబర్ 6, 2001లో విడుదలైన నువ్వు నాకు నచ్చావ్ నేటికి 21 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అప్పట్లో ఈ చిత్రాన్ని యువత రిపీటెడ్ గా చూసేవారు. థియేటర్లో పదిసార్లకు పైగా చూసిన ఆడియన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వెంకీ టైమింగ్ కామెడీ, ఆర్తీ అగర్వాల్ గ్లామర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. సెన్సేషనల్ విజయం సాధించిన నువ్వు నాకు నచ్చావ్ 57 కేంద్రాల్లో 100 రోజులు, 3 కేంద్రాల్లో 175 రోజుల రన్ పూర్తి చేసుకుంది. 

అయితే ఈ బడా బ్లాక్ బస్టర్ కి మొదటి ఛాయిస్ వెంకటేష్, ఆర్తి కాదట. చివరికి కీలకమైన ప్రకాష్ రాజ్ పాత్ర కోసం కూడా వేరే ఆర్టిస్ట్ ని అనుకున్నారట. అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ వెంకీ ఖాతాలో చేరింది. నువ్వే కావాలి బ్లాక్ బస్టర్ తర్వాత కె విజయ భాస్కర్, త్రివిక్రమ్ కాంబోలో నువ్వు నాకు నచ్చావ్  స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఫ్యామిలీ రొమాంటిక్ జోనర్ కావడంతో తరుణ్ తో చేద్దామనే అనే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నారట. అదే సమయంలో మంచి టైమింగ్, ఎమోషనల్ సబ్జెక్టు వేరే హీరోని ట్రై చేద్దామా? అనే ఆలోచన కూడా చేశారట. 

అప్పుడు సురేష్ బాబు నిర్మాత స్రవంతి రవికిశోర్ కి కాల్ చేసి ... వెంకటేష్ డేట్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పారట. వెంకటేష్ ని కలిసి స్క్రిప్ట్ చెప్పడంతో ఆయనకు నచ్చడం ఫైనల్  చేయడం జరిగిపోయాయట. ఆ విధంగా తరుణ్ చేయాల్సిన నువ్వు నాకు నచ్చావ్ వెంకీ ఖాతాలోకి వెళ్ళింది. హీరోయిన్ గా కూడా మొదట త్రిష, గజాల పేర్లు పరిశీలించారట. ఆ సమయంలో హిందీలో ఓ మూవీ చేసిన ఆర్తి సరిగ్గా సెట్ అవుతుందని, ఆమెను ఎంపిక చేశారు. కీలకమైన ప్రకాష్ రాజ్ పాత్రను నాజర్ తో చేయించాలని దర్శకుడు భావించాడు. నిర్మాత స్రవంతి రవి కిషోర్ పట్టుబట్టి ప్రకాష్ తో చేయించారట. ఆ విధంగా ఓ బ్లాక్ బస్టర్ లో నటించే అవకాశం.. వెంకీ, ఆర్తీ, ప్రకాష్ రాజ్ కొట్టేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios