సినిమా ఇండస్ట్రీలోకి దర్శకుడవుదామని వచ్చిన నాని అనుకోని విధంగా హీరోగా ఎదిగాడనే విషయం అందరికి తెలిసిందే. దొరికిన అవకాశంతోనే నాని కష్టపడి తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. కెరీర్ మొదట్లో వరుసగా హిట్స్ అందుకొని ఆ తరువాత మధ్యలో కొంచెం తడబడినా మళ్ళీ ఆ తరువాత వరుసగా డబుల్ హ్యాట్రిక్స్ తో తన మార్కెట్ ను పెంచుకున్నాడు. 

అయితే గత ఏడాది వరకు నేను లోకల్ - ఎంసీఏ చిత్రాలతో హ్యాపీగా ఉన్న నాని 2018లోకి వచ్చే సరికి ఊహించని చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు. కృష్ణార్జున యుద్ధం డిజాస్టర్ అవ్వగా ఆ తరువాత బిగ్ బాస్ షో ద్వారా కొంత నెగిటివ్ టాక్ రావడం షాకింగ్ అనే చెప్పాలి. నాని తనవరకు హోస్టింగ్ బాధ్యతను సక్రమంగానే నిర్వహించినప్పటికీ  కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్ తో పాటు శ్రీ రెడ్డి కామెంట్స్ కూడా తలపట్టుకునేలా చేశాయి. 

అయినా కూడా నాని తన పని తాను చేసుకుంటూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. బిగ్ బాస్ లాంటి షో మరోసారి చేయను అని నాని చెప్పాడు అంటే ఆయనకు ఆ షో ఎలాంటి అనుభవాన్ని నేర్పిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక రీసెంట్ గా వచ్చిన దేవదాస్ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా 10కోట్ల నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది.నాగార్జున లాంటి స్టార్ హీరో నాని పక్కన నటించినప్పటికీ సినిమా 30కోట్ల షేర్స్ అందుకోకపోవడం గమనార్హం. 

మొత్తంగా నానికి 2018పెద్దగా కలిసి రాలేదు. ఇక నెక్స్ట్ జెర్సీ సినిమాతో రానున్న న్యాచురల్ స్టార్ ఈ ఏడాది ఎండింగ్ లోనే సినిమాను విడుదల చెయ్యాలని అనుకుంటున్నాడు. క్రికెట్ నేపథ్యంలో వస్తోన్న ఆ సినిమాతో అయినా నాని మంచి హిట్ అందుకొని 2018కి హ్యాపీగా గుడ్ బై చెబుతాడో లేదో చూడాలి.