అక్కినేని కుటుంబ సభ్యులు ప్రస్తుతం స్పెయిన్ వెకేషన్ లో ఉన్నారు. ఇటీవల కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ అంతా వెకేషన్ కు వెళ్ళింది. నాగ చైతన్య, సమంత జంట కూడా ఈ సెలెబ్రేషన్ లో పాల్గొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున ఈ వారం బిగ్ బాస్ షోకు కూడా దూరంగా ఉన్నారు. 

ఇదిలా ఉండగా నాగ చైతన్య, సమంత ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. సమంతే ఈ వీడియో పోస్ట్ చేసింది. ఫేమస్ సాంగ్ 'వి విల్ రాక్ యు'కు సమంత ఉత్సాహభరితంగా డాన్స్ చేస్తోంది. పక్కనే ఉన్న చైతు ఆమెని అనుకరిస్తున్నాడు. 

తామిద్దరం 80లలో చిన్నపిల్లలుగా మారిపోయామని సమంత పోస్ట్ చేసింది. సమంత ఏఈ వీడియో పోస్ట్ చేసి 24 గంటలు గడవక ముందే 20 లక్షల మంది వీక్షించారు. ఈ ఏడాది సమంత, చైతు జంటగా నటించిన మజిలీ చిత్రం ఘనవిజయం సాధించింది. నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I love you for always pretending to be as enthusiastic as I am 😂😂 @chayakkineni ❤️❤️ #childrenofthe80s

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Aug 31, 2019 at 6:56am PDT