అక్టోబర్ 6న చై, సామ్ ల వివాహం అతిథులను ఆహ్వానిస్తున్న అక్కినేని కుటుంబం స్పెషల్ గెస్ట్ ల జాబితాలో సినీ ప్రముఖులు

టాలీవుడ్ ప్రేమ జంట నాగచైతన్య, సమంతలు వివాహ బంధంతో ఒకటి కావడానికి మరెంతో దూరం లేదు. పెళ్లి.. అక్టోబర్ 6న గోవాలో జరగనుంది. తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. అయితే.. పెళ్లికి కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. మొత్తం 175మంది జాబితాను తయారు చేశారు. ఆ జాబితాలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు.

పెళ్లికి పిలవాలనుకున్న అత్యంత సినీ ప్రముఖులకు నాగార్జున స్వయంగా తన చేతులతో వెడ్డింగ్ కార్డులు పంచుతారని సమాచారం. నాగ చైతన్య, సమంతలు ఇద్దరూ కలిసి ప్రత్యేకంగా ఎన్టీఆర్, రానాలను పెళ్లికి ఆహ్వానించారట. అంతేకాకుండా చైతూ.. తన స్నేహితులు అల్లు శిరీష్, నితిన్ లను పిలిచారట. ఇక నాగార్జున వైపు నుంచి చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ లు మొదటి వరసలో ఉన్నారు. రామ్ చరణ్, ఉపాసనలు కూడా వ్యక్తిగతంగా ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉంది.

ఇక సమంత వైపు నుంచి ఆమె కుటుంబ సభ్యులతోపాటు ఆమె పర్సనల్ స్టైలిస్ట్ కోన నీరజ ను పిలిచారని టాక్. తనతో కలిసి నటించిన హీరోయిన్లను పెళ్లికి ఆహ్వానించలేదట సమంత. ఇక వారందరినీ.. రిసెప్షన్ కి పిలిచే అవకాశం ఉంది. ఈ పెళ్లికి ఆహ్వానించిన వారందరినీ గోవాలో మూడు రోజులు ఉండేలా రావాలని కోరుతున్నారట. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసినట్లు టాలీవుడ్ టాక్.