Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి 'విశ్వంభర' కోసం 7 ఎకరాల్లో 13 భారీ సెట్లు.. మామూలు ప్లానింగ్ కాదుగా

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే ఈ చిత్ర టైటిల్, కాన్సెప్ట్ గురించి రివీల్ చేస్తూ విడుదల చేసిన వీడియోకి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. 

13 huge sets erected for Chiranjeevi Vishwambhara movie dtr
Author
First Published Jan 20, 2024, 3:42 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే ఈ చిత్ర టైటిల్, కాన్సెప్ట్ గురించి రివీల్ చేస్తూ విడుదల చేసిన వీడియోకి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. 

కళ్ళు చెదిరే విజువల్స్ తో ఫాంటసీ డ్రామాగా వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. కాన్సెప్ట్ వీడియోలో చూపించిన విజువల్స్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో చిరు ముల్లోకాలు తిరిగే వీరుడిగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండే చిత్రం కాబట్టి ఎక్కువభాగం సెట్స్ లోనే షూటింగ్ జరగనుందట. అన్నపూర్ణ స్టూడియోస్ లో తాజాగా ఈ చిత్రం కోసం దాదాపు 7 ఎకరాల్లో 13 భారీ సెట్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో సెట్స్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన సెట్స్ లో ఫిబ్రవరి మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. విశ్వాంతరాళంలో జరిగే కథ కాబట్టి ఆ స్థాయిలో భారీ సెట్లు అవసరం అవుతున్నాయి. 

కాన్సెప్ట్ పోస్టర్ చూసిన తర్వాత.. ఏదో ఒక లోకం నుంచి విసిరివేయబడ్డ పెట్టె చుట్టూ కథ తిరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి చిత్రాల తర్వాత ఆ జోనర్ లో మెగాస్టార్ నటిస్తున్న చిత్రం ఇదే. ఇదిలా ఉండగా చాలా కాలం తర్వాత చిరంజీవి, కీరవాణి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడం ఆ అంచనాలు కూడా ఉన్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios