గత ఏడాది విడుదలైన 12th ఫెయిల్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవితం ఆధారంగా బయోపిక్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
గత ఏడాది విడుదలైన 12th ఫెయిల్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవితం ఆధారంగా బయోపిక్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు ఓటిటి లో సైతం దూసుకుపోతోంది. గొప్ప బయోపిక్ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచిపోతుందని చెప్పడంలో సందేహం లేదు.
మనోజ్ కుమార్ పాత్రలో విక్రాంత్ మాస్సే అద్భుతంగా నటించారు. డైరెక్టర్ విధు వినోద్ చోప్రా రియలిస్టిక్ టేకింగ్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. మనోజ్ కుమార్ ఐపిఎస్ అధికారి కావడానికి ఎంతలా కష్టపడ్డాడు అనేది చూపిస్తూనే.. ఇండియాలో విద్యావ్యవస్థలో ఉన్న లోపాలని కూడా ఎత్తిచూపారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, క్రిటిక్స్ మాత్రమే కాదు.. సెలెబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
12th ఫెయిల్ చిత్రంతో విక్రాంత్ మాస్సే ఒకసారిగా స్టార్ హీరో అయిపోయాడు. గతంలో బుల్లితెరపై అనేక టీవీ సీరియల్స్ లో నటించిన విక్రాంత్ కి వెండి తెరపై గుర్తింపు పొందడానికి ఇంతకాలం పట్టింది. ఈ క్రమంలో తాను కెరీర్ లో, రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని విక్రాంత్ అంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో సినిమా అవకాశాల కోసం పడ్డ కష్టాలని వివరించారు.
టీవీ సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు నెలకి 35 లక్షలు సంపాదించేవాడిని. వెండితెరపై రాణించాలనే ఉద్దేశంతో సీరియల్స్ లో నటించడం మానేశాను. దీనితో సంపాదన పోయింది. కొన్ని నెలలకు ఆడిషన్స్ కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. ఆ టైంలో తన భార్య శీలాత్ ఠాకూర్ తనకి ప్రతి నెలా డబ్బు ఇచ్చి ఆదుకునట్లు విక్రాంత్ తెలిపారు .
తన సక్సెస్ విషయంలో శీలత్ క్రెడిట్ ఎంతైనా ఉందని విక్రాంత్ అన్నారు. ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందనే సామెత విక్రాంత్ విషయంలో రుజువైంది. ఓటిటి హవా పెరగడంతో అక్కడ మంచి అవకాశాలు అందుకున్న విక్రాంత్ ఆ తర్వాత 12th ఫెయిల్ చిత్రంతో అదరగొట్టేశాడు.