Balakrishna:బాలయ్యని ఒప్పించటానికి నిర్మాతల కమిటి, దిల్ రాజు ఏడి?
నిర్మాతల నుంచి ఏర్పాటు అయిన ఈ కమిటీలో బాలయ్యతో 'ఆదిత్య 369' వంటి సూపర్ డూపర్ క్లాసిక్ హిట్ సినిమా తీసిన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, షైన్ స్క్రీన్స్ అధినేతలలో ఒకరు అయిన సాహూ గారపాటి ఉన్నారని సమాచారం. వాళ్ళిద్దరితో పాటు మరో ముగ్గురు ఉన్నారట.
టాలీవుడ్ లో నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయంతో కొన్ని రోజులుగా షూటింగులు నిలిచిపోయాయన సంగతి తెలసిందే. ఫ్లాఫ్ ల శాతం ఎక్కువ కావడంతో దానికి కారణాలు అన్వేషించే పనిలో రెగ్యులర్‌గా సినిమాలు తీసే నిర్మాతలు మీటింగ్ లు పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో స్టార్ హీరో రెమ్యూనరేషన్స్ నుంచి రోజూ వారి కార్మికుల వేతనాలు, ఓటీటీల ప్రభావం వరకూ పలు అంశాలపై చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ ప్రయత్నాలకు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మద్దతు కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సమాచారం.
బాలకృష్ణ ..ఇండస్ట్రీ బంద్ ని సపోర్ట్ చేయటం లేదని మీడియా వర్గాల సమాచారం. అంతేకాకుండా మైత్రీ మూవీ మేకర్స్ ని తమ #NBK107 షూటింగ్ మొదలు పెట్టమని ప్రెజర్ చేస్తున్నారట. ఎందుకంటే దిల్ రాజు తను విజయ్ తో చేస్తున్న వారసుడు షూటింగ్ ఆపలేదు. అలాగే ధనుష్..సార్ షూటింగ్ లు ఆపలేదు. ఈ క్రమంలో తాము మాత్రం ఎందుకు బంద్ పెట్టుకుని టైమ్ వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి అని బాలయ్య వాదనగా చెప్తున్నారు. దాంతో ఈ విషయం తెలిసిన గిల్డ్ కంగారు పడి బాలయ్యను కన్వీన్స్ చేసి ఒప్పించేందుకు ఓ కమిటీని ఫామ్ చేసారని తెలుస్తోంది.
ఈ కమిటీ పని ఏమిటి అంటే...నందమూరి బాలకృష్ణను కలిసి నిర్మాతల సమస్యలు తెలియజేయడంతో పాటు, ఆయన నుంచి సలహాలు స్వీకరించడం కోసం అని తెలుస్తోంది. నిర్మాతల నుంచి ఏర్పాటు అయిన ఈ కమిటీలో బాలయ్యతో 'ఆదిత్య 369' వంటి సూపర్ డూపర్ క్లాసిక్ హిట్ సినిమా తీసిన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, షైన్ స్క్రీన్స్ అధినేతలలో ఒకరు అయిన సాహూ గారపాటి ఉన్నారని సమాచారం. వాళ్ళిద్దరితో పాటు మరో ముగ్గురు ఉన్నారట. అయితే నిర్మాతల తరపున వేసిన కమిటీలో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు లేకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
నందమూరి బాలకృష్ణ హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఒక సినిమా నిర్మిస్తున్నారు. నిర్మాతలు తీసుకున్న నిర్ణయం వల్ల ఆ సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. 'సింహం వేట మొదలు' అంటూ ఆల్రెడీ టీజర్ విడుదల చేశారు. 'మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్. నా జీవో గాడ్స్ ఆర్డర్', 'భయం నా బయోడేటాలోనే లేదురా బోసు డీకే' అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగులు అభిమానులను అలరించారు. బాలకృష్ణకు 107వ చిత్రమిది (NBK 107). టీజర్, బాలకృష్ణ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
బ్లాక్ బస్టర్ 'అఖండ' తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రమిది. అలాగే, 'క్రాక్' విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్. ఇందులో హానీ రోజ్ (Honesy Rose) రెండో హీరోయిన్ . వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. మోడల్ కమ్ హీరోయిన్, 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో చేశారు. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన తారాగణం. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.