సాధారణంగా హిట్ సినిమాల్లో సీన్స్ ని పేరడీ చేస్తూంటారు. అయితే పాటలు కూడా యాజటీజ్ సెట్టింగ్స్ తో ఖర్చు పెట్టి మరీ చేస్తారా అంటే కష్టమే అని చెప్పాలి. కానీ మళయాళీయులు అబ్బే..మాకు కష్టమేం కాదు అంటూ చేసి చూపించారు. బాహుబలిలోని సూపర్ హిట్ పాటను స్పూఫ్ చేసి సక్సెస్ అయ్యారు.

బాహుబలి, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా. ప్రముఖ దర్శకులు సైతం సాహో అనే విధంగా బాహుబలిని రాజమౌళి తెరకెక్కించారు. ఆ సినిమా  సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అప్పటిదాకా ఉన్న రికార్డులు అన్నీ తిరగ రాసింది. ఇప్పడు ఏ రికార్డైనా నాన్‌-బాహుబలి రికార్డుగా చెప్పకునే పరిస్దితి వచ్చిందంటే ఆ సినిమా సృష్టించిన సంచలనం అలాంటింది. దేశ విదేశాల్లో రికార్డులు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల బెంచ్ మార్కును దాటిన చిత్రంగా బాక్సాఫీసు వద్ద కొత్త ఫీట్‌ను సృష్టించింది.  ఆ సినిమా విజయంలో పాటలు కూడా ముఖ్య పాత్ర పోషించాయి.  కీర‌వాణి స‌మ‌కూర్చిన బాణీల‌ు ప్రేక్షకులకు మరో లోకానికి తీసుకెళ్లిపోయాయి.

ఈ క్రమంలో తాజాగా ఈ  చిత్రంలోని  హంస నావ సాంగ్ (ఓరోరి రాజా వీరాది వీరా అనే పాట‌ని ) మ‌ల‌యాళీలు అదే స్టైల్‌లో రూపొందించారు. బాహుబ‌లి పాట‌లో మాదిరిగానే కళాకృతిని, సెట్టింగ్ రూపొందించి పాట రెడీ చేశారు. అనాశ్వ‌ర రాజ‌న్.. ప్ర‌భాస్ పాత్ర‌లో సంద‌డి చేస్తే, అనుష్క పాత్ర‌లో అజు వ‌ర్గీస్ క‌నిపించింది.

 జిబు జాక‌బ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్నఆధ్య రాత్రి సినిమా కోసం ఈ పాట రూపొందించారు. ప్ర‌స్తుతం ఈ పాట వైర‌ల్ అవుతుంది. ఆన్ ఆమి, రంజిత్ జ‌య‌రామ‌న్ పాట ఆల‌పించగా, సంతోష్ వ‌ర్మ లిరిక్స్ అందించారు. బిజిబ‌ల్ సంగీతం అందించారు. తాజాగా విడుద‌లైన సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.