సినీ యువ రచయిత ఆత్మహత్య

First Published 12, Jul 2018, 12:55 PM IST
'Ab Tak Chhappan' writer Ravishankar Alok commits suicide
Highlights

రవి శంకర్ అలోక్ తల్లిదండ్రులు కూడా కొద్ది రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారని, అయితే ఇటీవలే వారు తమ స్వస్థలం పట్నాకు వెళ్లినట్టు అక్కడ వాచ్‌మన్ తెలిపాడు. సాధారణంగా టెర్రస్ గేట్ లాక్ చేసి ఉంటుందని, దీన్ని అలోక్ ఎలా తెరిచాడో తెలియదని ఆయన పేర్కొన్నాడు. 

బహుళ అంతస్థు భవనంపై నుంచి దూకి ఓ సినీ రచయిత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబయికి చెందిన రవిశంకర్ అలోక్ (32) పలు హిందీ  సినిమాలకు రచయితగా పనిచేశారు.

పశ్చిమ అంధేరిలోని సెవెన్ బంగ్లా ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవంతిపై నుంచి రాత్రి 2 గంటల సమయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. న మరిన్ని వివరాల ప్రకారం, రవిశంకర్ పశ్చిమ అంధేరీలోని సెవన్ బంగ్లాస్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.

 రవి శంకర్ అలోక్ తల్లిదండ్రులు కూడా కొద్ది రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారని, అయితే ఇటీవలే వారు తమ స్వస్థలం పట్నాకు వెళ్లినట్టు అక్కడ వాచ్‌మన్ తెలిపాడు. సాధారణంగా టెర్రస్ గేట్ లాక్ చేసి ఉంటుందని, దీన్ని అలోక్ ఎలా తెరిచాడో తెలియదని ఆయన పేర్కొన్నాడు. 

బుధవారం రాత్రి 2 గంటల సమయంలో పెద్ద శబ్దం రావడంతో అటువైపు వెళ్లిచూసే సరికి అలోక్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని వాచ్‌మెన్ వెల్లడించాడు. తక్షణమే అంబులెన్స్‌కు ఫోన్ చేయడంతో పోలీసులు కూడా చేరుకున్నారని తెలియజేశాడు. 

తన భవంతి పై అంతస్తుకు చేరుకున్న అలోక్ అక్కడి నుంచి దూకాడని, ఇంట్లో ఇంట్లో ఏ విధమైన సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. రవి సోదరుడు కూడా ఇక్కడే ఉంటున్నా, ఆ సమయంలో మాత్రం అతడు ఇంట్లో లేడు. గతేడాది నుంచి తీవ్ర ఒత్తిడిలో ఉన్న అలోక్, ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సుబ్రుబాన్ వెర్సోవా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఏడాది కాలంగా అతనికి బాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. దీన్ని ప్రమాదవశాత్తు మరణంగానే కేసు నమోదుచేసినట్టు డీసీపీ పరంజిత్ సింగ్ దహియా తెలిపారు. 

loader