కమెడియన్ పృథ్వి ఎన్నికల సమయంలో వైసీపీలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కమెడియన్ పృథ్విని సీఎం జగన్ శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ కు చైర్మన్ గా నియమించారు. కమెడియన్ గా రాణిస్తున్న పృథ్వి ప్రస్తుతం రాజకీయంగా కూడా బాగా పాపులర్ అయ్యాడు. 

తాజాగా చిత్ర పరిశ్రమకు చెందిన మరో వ్యక్తికీ ఎస్వీబీసీ ఛానల్ లో పదవి దక్కింది. ఢమరుకం ఫేమ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని జగన్ ఎస్వీబిసి చైర్మన్ గా అపాయింట్ చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డికి చిత్ర పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇదిలా ఉండగా శ్రీనివాస్ రెడ్డికి ఎస్వీబిసి పదవి దక్కగానే.. ఆ పదవి కమెడియన్ శ్రీనివాస్ రెడ్డికి అంటూ వార్తలు వచ్చాయి. దీనితో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆ పదవి దక్కింది దర్శకుడు శ్రీనివాస్ రెడ్డికి అని తెలిపాడు.