తన సినిమాలు, షూటింగ్‌లు తప్పించి బయట పెద్దగా కనిపించని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో తళుక్కున మెరిశారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం గురువారం ఆయన ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.

ప్రభాస్ అక్కడ కనిపించగానే ఆర్టీఏ ఆఫీసు సిబ్బంది, జనం అవాక్కయ్యారు. ఈ సందర్భంగా కొందరు సిబ్బంది ప్రభాస్‌తో సెల్ఫీలు దిగారు. ఇంకొందరు తమ సెల్‌ఫోన్లలో క్లిక్‌మనిపించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా కారణంగా మాస్క్ పెట్టుకుని, సింపుల్‌గా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో డార్లింగ్ మెరిసిపోతున్నారు.

Also Read:రాధే శ్యామ్‌`కు దిమ్మ తిరిగే పేమెంట్ అందుకుంటున్న ప్రభాస్

కాగా ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ‘‘ రాధే శ్యామ్’’ ఫస్ట్‌లుక్‌ను జూలై 10న విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు బాహుబలి అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది.

ఈ చిత్రాన్ని యూవీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసిధ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు.