టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత స్పెషల్ పోస్టర్ తో ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. ఎంత గ్యాప్ వచ్చినా పవర్ స్టార్ క్రేజ్ లో ఏ మాత్రం తేడా రాలేదని సోషల్ మీడియాలో వచ్చిన రీ ట్వీట్స్ తో క్లారిటీ వచ్చింది. ఇండియాలోనే అత్యధిక హ్యాష్ ట్యాగ్ ద్వారా వైరల్ అయిన టాలీవుడ్ పోస్టర్ గా వకీల్ సాబ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

ఇక సినిమాకు సంబందించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. సినిమాలో నివేత థామస్ ఒక స్పెషల్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వస్తోంది. ఆమె పాత్ర సినిమాలో చాలా ఎమోషనల్ గా ఉంటుందట. కోర్ట్ సీన్ లో పవన్ కళ్యాణ్ - నివేత థామస్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయట. బాలీవుడ్ పింక్ రీమేక్ గా వస్తోన్న ఈ సినిమాలో తాప్సి చేసిన పాత్రలో నివేత నటిస్తోందట.  ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మే లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

లాయర్ గా కనిపించనునా పవన్ కళ్యాణ్ తెరపై ఏ విధంగా కనిపిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది, భారీ అంచనాలు నెలకొన్న వకీల్ సాబ్ చిత్రానికి వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మొదటి సాంగ్ ని సిద్ శ్రీరామ్ తో పాడిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్యూన్స్ కూడా రెడీ చేశారట. మరీ ఈ సినిమాతో పవర్ స్టార్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి.