సీనియర్ నటి టబుతో కలిసి రొమాన్స్ చేయడం తనకు సులభంగానే అనిపించిందని అంటున్నాడు యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్. ఈ కుర్ర హీరో నటిస్తోన్న తాజాగా చిత్రం 'ఏ సూటబుల్ బాయ్‌'. ఇందులో ఇషాన్, టబు కలిసి నటిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇషాన్.. టబుతో రొమాన్స్ గురించి స్పందించాడు. ఆమెతో కలిసి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడం సులభమేనని.. ఎదుటివారిని మంత్రముగ్దుల్ని చేయడంతో తనను తానే సాటి అని చెప్పుకొచ్చాడు. తనకు ప్రేమికుడి పాత్రలో నటించడం ఇష్టమని.. ఆ పాత్రలో సులభంగానే నటించానని చెప్పుకొచ్చాడు.

'జబర్దస్త్' కమెడియన్ బెడ్రూమ్ టాపిక్.. చెంప చెళ్లుమనిపించిన యాంకర్!

టబుకి 'తబాస్కో' అనే ముద్దు పేరు పెట్టడంతో పాటు ఆమెని మిర్చితో పోల్చాడు. టబుకి ఎలాంటి బహుమతి ఇస్తారని ప్రశ్నించగా.. తనకు నా హృదయాన్ని బహుమతిగా ఇస్తానని చెప్పాడు. అంతేకాదు.. గాలిబ్ కవిత పుస్తకాన్ని కూడా తనకు బహుమతిగా ఇస్తానని చెప్పాడు.

మీరా నాయర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్.. రాజకీయనాయకుడు మహేష్ కపూర్ కుమారుడు మాన్ కపూర్ పాత్రలో కనిపించనున్నాడు. ఓ అందమైన వేశ్యకి ఆకర్షితుడై తండ్రికి ఎదురుతిరిగే కుమారుడి పాత్రలో ఇషాన్ కనిపించనున్నాడు. ఇందులో వేశ్య సైదా బాయ్ పాత్రలో టబు కనిపించనున్నారు.