మెగాస్టార్ చిరంజీవి నటించిన వరుస చిత్రాలకు ఓకే చెప్పేస్తున్నారు. ఖైదీ నెం 150తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. సైరా చిత్రం కోసం ఎక్కువ టైం తీసుకున్నారు. సైరా చిత్రం గత ఏడాది విడుదలయింది. కరోనా వచ్చి గ్యాప్ ఇచ్చింది కానీ లేకుంటే ఈ పాటికి చిరంజీవి రెండు మూడు చిత్రాలు [ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండేవి. 

లాక్ డౌన్ సందర్భంగా చిరంజీవి పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలలో చిరు తన తదుపరి చిత్రాల గురించి వివరిస్తూ మెహర్ రమేష్, బాబీ లాంటి దర్శకులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు చిరంజీవి రివీల్ చేశారు. 

తాజాగా ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం దర్శకుడు బాబీ మెగాస్టార్ కోసం ఓ అద్భుతమైన కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కథలో చిరంజీవితో పాటు మరో యువ హీరో పాత్రకు కూడా ఆస్కారం ఉందట. ఆల్రెడీ చరణ్ ఆచార్య చిత్రంలో నటిస్తున్నాడు. కాబట్టి ఆ పవర్ ఫుల్ రోల్ కోసం దర్శకుడు బాబీ రానా పేరుని పరిశీలిస్తున్నట్లు టాక్. 

రానా, మెగాస్టార్ కలిస్తే అది తప్పకుండా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. మరి బాబీకి రానా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.