ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.. తెలుగు ప్రేక్షకులందరిని సర్ ప్రైజ్ చేసిన చిత్రం ఇది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నవీన్ పోలిశెట్టి హీరోగా, డెబ్యూ దర్శకుడు స్వరూప్ తెరకెక్కించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రం మంచి  విజయం అందుకుంది. దర్శకుడి టేకింగ్, నవీన్ కామెడీ టైమింగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. 

ప్రస్తుతం ఈ సూపర్ హిట్ జోడి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఓ  ఇంటర్వ్యూలో స్వరూప్ మాట్లాడుతూ లాక్ డౌన్ తర్వాత ప్రీ ప్రొడక్షన్ మొదలు పెడతామని అన్నారు. ఈ చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయకు భిన్నంగా ఉంటుందని తెలిపాడు. 

సాహో బ్యూటీ.. ఈ అందాల సునామీని ఆపడం కష్టం

దర్శకుడు స్వరూప్ తన డ్రీమ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ లతో భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించాలనేది తన కోరిక అని తెలిపాడు. ఒక వేళ ఆ అవకాశమే వస్తే అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించే విధంగా ఆ చిత్రాన్ని రూపొందిస్తా అని స్వరూప్ తన మనసులో మాట బయట పెట్టాడు. 

మరి స్వరూప్ డ్రీమ్ చాలా పెద్దది.. అయినప్పటికీ స్వరూప్ ఆ స్థాయికి చేరుకోవాలని కోరుకుందాం.