Asianet News TeluguAsianet News Telugu

అతడు స్టార్ కాదు.. రానాపై శ్రీయ కామెంట్స్!

బాహుబలి, ఘాజి లాంటి చిత్రాలతో భల్లాల దేవుడు రానా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. రానాకు ప్రస్తుతం నార్త్ లో కూడా మంచి గుర్తింపు ఉంది. తన ఇమేజ్ కు తగ్గట్లుగానే రానా ప్రస్తుతం యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలని ఎంచుకుంటున్నాడు.

Young Actress Shriya comments on Rana daggubati
Author
Hyderabad, First Published Dec 5, 2019, 5:43 PM IST

బాహుబలి, ఘాజి లాంటి చిత్రాలతో భల్లాల దేవుడు రానా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. రానాకు ప్రస్తుతం నార్త్ లో కూడా మంచి గుర్తింపు ఉంది. తన ఇమేజ్ కు తగ్గట్లుగానే రానా ప్రస్తుతం యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలని ఎంచుకుంటున్నాడు. రానా బాలీవుడ్ లో 'హాథీ మేరే సాథీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో రానా అడవుల్లో జంతువులతో సహవాసం చేసే వ్యక్తిగా డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఆ మధ్యన రానా ఏనుగులతో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Wrapped shoot for ‘ Haathi Mere Saathi ‘ / ‘Aranya ‘ / ‘ Kadan ‘ ( in the three languages respectively ) 🙃 I feel incredibly grateful to be a part of this film and all that it stands for . @ranadaggubati, you were a student on set and not a star . That’s so rare . I’m in awe of your commitment & passion towards cinema and your desire to give back . This is a grand vision and I was working alongside an incredibly dedicated cast and crew . This was also my first time filming in three languages ( Tamil, Telugu, Hindi) which was a whole new challenge in itself but very exciting . Thank you @erosnow , Prabhu Sir , @pb.mounica , @exceedentertainment for this opportunity 🙏🏼🐘 . . . #HaathiMereSaathi #Kadan #Aranya #Eros #FortheloveofElephants #ManvsNature #TamilTeluguDebut

A post shared by Shriya Pilgaonkar (@shriya.pilgaonkar) on Dec 4, 2019 at 7:57pm PST

యంగ్ హీరోయిన్ శ్రీయ పిల్గాన్కర్ కీలక పాత్రలో నటిస్తోంది. తన తన పాత్ర షూటింగ్ పూర్తయినట్లు శ్రీయ సోషల్ మీడియాలో పేర్కొంది. ఇన్స్టాగ్రామ్ లో హీరో రానాపై ప్రశంసలు కురిపించింది. సెట్స్ లో ఉన్నప్పుడు రానా స్టార్ కాదు.. నిత్య విద్యార్థి. అతడి కమిట్మెంట్ కు ఆశ్చర్యపోయా అని శ్రీయ పేర్కొంది. 

తాను నటిస్తున్న మొట్టమొదటి బహుభాషా చిత్రం ఇదేనని, అద్భుతమైన టీంతో వర్క్ చేసినందుకు సంతోషంగా ఉందని శ్రీయ చెప్పుకొచ్చింది. ప్రభు సోలమన్ ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios