ఒక్కోసారి అభిమానులు చేసే పనుల కారణంగా సినీ ప్రముఖులు ఇబ్బంది పడుతుంటారు. తాజాగా కుర్ర హీరోయిన్ నూరిన్ షరీఫ్ కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. 'ఒరు అడార్ లవ్' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన నూరిన్ తాజాగా మంజేరీలో ఓ సూపర్ మార్కెట్ ప్రారంభానికి వచ్చింది.

ఆ సమయంలో అభిమానులు ఆమెని చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఆమె ముక్కుకి గాయమైంది. దీంతో నొప్పిని తట్టుకోలేక నూరిన్ స్టేజ్ పైనే ఏడ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భవిష్యత్తులో గోశాల ప్రారంభిస్తా.. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రాంచరణ్!

పూర్తి వివరాల్లోకి వెళితే.. నూరిన్ ఇటీవల ఓ సూపర్ మార్కెట్ ఓపెనింగ్ కి హాజరైంది. ముందుగా నిర్వాహకులు కార్యక్రమం 4 గంటలకు మొదలవుతుందని చెప్పారు. వారు చెప్పిన సమయానికే నూరిన్ తన తల్లితో కలిసి హోటల్ కి చేరుకుంది. కానీ కార్యక్రమ నిర్వాహకులు ఎక్కువమంది హాజరావ్వడానికి సాయంత్రం 6 గంటల వరకు హోటల్ లోనే ఉండాలని నూరిన్ ని కోరారు. వారు చెప్పినట్లుగానే 6 గంటలకు నూరిన్ అక్కడకి చేరుకున్నారు.

ఆమె ఆలస్యంగా వచ్చిందని భావించిన జనాలు.. నూరిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు నూరిన్ కారుని బాదడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటివి చేశారు. నూరిన్ కిందకి దిగగానే.. ఓ వ్యక్తి చేయి నూరిన్ ముక్కుకి బలంగా తగలడంతో ఆమెకి గాయమైంది. దీంతో నొప్పిని భరించలేక నూరిన్ ఏడ్చేసింది. ఆ తరువాత తన బాధని కంట్రోల్ చేసుకుంటూ కార్యక్రమంలో మాట్లాడారు.