Asianet News TeluguAsianet News Telugu

‘అల... వైకుంఠపురములో..’ డిజిటల్ బ్రేక్..!

ఏదైనా కొత్త సినిమా వస్తోందంటే ఓ నాలుగు రోజులు పోతే అమెజాన్, నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా చూడచ్చు కదా అని వెయిట్ చేస్తున్నారు. దాంతో థియేటర్ లో చూసేవారి సంఖ్య తగ్గిపోతోంది. మరీ ముఖ్యంగా విదేశాల్లో ఉండే మన తెలుగువాళ్లు చాలా మంది ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ లను బాగా వినియోగిస్తున్నారు. దీంతో ఓవర్సీస్‌లో సినిమాల కలెక్షన్లు పడిపోతున్నాయి.

you wont see ala vikuntapuramlo in amazon and netflix
Author
Hyderabad, First Published Oct 15, 2019, 8:14 AM IST

థియోటర్ కు వెళ్లి టైమ్, డబ్బు ఖర్చు పెట్టే కన్నా ..చక్కగా మన ఇంట్లో మనం మన సోఫాలో కూల్ గా కూర్చుని, మన ల్యాప్ టాప్ లో సినిమా చూడచ్చు అనే కాన్సెప్టు కు మెల్లిగా తెలుగు వాళ్లు అలవాటు పడిపోయారు. దాంతో ఏదైనా కొత్త సినిమా వస్తోందంటే ఓ నాలుగు రోజులు పోతే అమెజాన్, నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా చూడచ్చు కదా అని వెయిట్ చేస్తున్నారు.

దాంతో థియేటర్ లో చూసేవారి సంఖ్య తగ్గిపోతోంది. మరీ ముఖ్యంగా విదేశాల్లో ఉండే మన తెలుగువాళ్లు చాలా మంది ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ లను బాగా వినియోగిస్తున్నారు. దీంతో ఓవర్సీస్‌లో సినిమాల కలెక్షన్లు పడిపోతున్నాయి.  ఈ చిత్రమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్ద.. బ్లూస్కై సినిమాస్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుకుతున్న ‘అల... వైకుంఠపురములో..’ చిత్రం ఓవర్సీస్‌ హక్కులు భారీ ధరకు దక్కించుకున్న బ్లూస్కై సినిమాస్‌..ఈ  సినిమాను ఆమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లో చూడలేరని తెలుపుతూ.. అందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ మేరకు సంస్దతో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకునేటప్పుడే ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.  దీన్ని బట్టి అర్దమయ్యేదేమిటంటే... ఈ చిత్రం థియేటర్లలో ఉన్నంతకాలం.. డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉండదు.

ఈ డెసిషన్  ద్వారా ఓవర్సీస్‌లో కలెక్షన్లు రాబట్టుకోవచ్చనేది ఆ సంస్థ  ఆలోచన.  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, నివేధా పేతురాజ్ హీరోయిన్స్.. టబు, సుశాంత్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సునీల్, నవదీప్, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న 'అల..వైకుంఠపురములో'.. రిలీజ్ కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios