కొన్ని నెలల క్రితం బోల్డ్ ట్రైలర్ తో షాక్ ఇచ్చింది 'ఏడు చేపల కథ'. కనీసం ఈ సినిమాలో ఎవరు నటించారు..? డైరెక్టర్ ఎవరనే విషయాలు కూడా ఆడియన్స్ కి పెద్దగా తెలియవు. కానీ ఒక్క ట్రైలర్ తో విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. ట్రైలర్ మొత్తం బోల్డ్ సన్నివేశాలు, బూతు డైలాగులు ఉండడంతో సినిమా సెన్సార్ కూడా జరగదని భావించారు.

కానీ ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన వారంతా దారుణమైన కామెంట్స్ చేశారు. చెత్త సినిమా అని, చాలా చీప్ గా తీశారని విమర్శలు చేస్తున్నారు. కానీ ఓ వర్గపు ఆడియన్స్ ని మాత్రం సినిమాలో బూతు డైలాగులు, సీన్లే ఆకర్షించినట్లున్నాయి. ఈ సినిమా కోసం థియేటర్ల వద్ద ఎగబడుతున్నారు. 

yedu chepala katha movie review: ‘ఏడు చేపల కథ’ రివ్యూ!

మాస్ సెంటర్లలో ఈ సినిమాకి తోలిరోజు హౌస్ ఫుల్స్ పడడం విశేషం. పెద్ద మాస్ హీరో సినిమాలకు టికెట్ల కోసం లైన్లో జనాలు ఎగబడటం చూస్తుంటాం. అలాంటిది ఈ 'ఏడు చేపల కథ' సినిమా కోసం జనాలు థియేటర్ల ముందుకు క్యూలు కట్టడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

తొలిరోజు ఈ సినిమా కలెక్షన్స్ చూసిన వారు షాక్ అవుతున్నారు. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.1.9 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీనిలో డిస్ట్రిబ్యూటర్ షేర్ విలువ రూ.1.13 కోట్లు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.1.4 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ప్రస్తుతానికి సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి తక్కువ స్థాయి, నాసిరకపు సినిమాకి ఇలాంటి వసూళ్లు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.