టాలీవుడ్ బెస్ట్ లవ్ స్టోరీస్ లో 'ఏ మాయ చేశావే' ఒకటి. నాగ చైతన్య కి దక్కిన మొదటి విజయంతో పాటు సమంత మొదటి సినిమా కూడా అదే కావడం సో స్పెషల్ అని చెప్పవచ్చు. చైతు సమంతల మనసులను ఒకటి చేసిన ఆ సినిమాకు రెహమాన్ అందించిన పాటలు ఎవర్ గ్రీన్. అయితే దర్శకుడు గౌతమ్ మీనన్ ఆ కథకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తమిళ్ తెలుగులో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా కొన్నాళ్ళకు హిందీలో కూడా రిలీజ్ అయ్యింది. తమిళ్ శింబు - త్రిషా జంటగా నటించగా హిందీలో ప్రతీక్ - అమీ జాక్సన్ జంటగా నటించారు. అయితే ఇప్పుడు డైరెక్టర్ గౌతమ్ మీనన్ సరికొత్త తరహాలో సీక్వెల్ ని రెడీ చేశాడట. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ పూర్తి వివరాలను తెలియజేయలేదు. అయితే తమిళ్ లో మాత్రం  ఒక జంటను కూడా రెడీ చేసినట్లు టాక్ వస్తోంది. ఈ సారి శింబు సరసన త్రిష కాకుండా అనుష్క ను అనుకుంటున్నట్లు సమాచారం.

శింబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే సినిమాను స్టార్ట్ చేయాలని గౌతమ్ మీనన్ ప్లాన్ చేసుకున్నాడట. తమిళ్ లో తెరకెక్కుతుంది అంటే తప్పకుండా తెలుగులో కూడా సినిమా వస్తుందని చెప్పవచ్చు. అయితే తెలుగులో ఏమైనా మార్పులు చేస్తారా లేదా అనేది చూడాలి. కార్తీక్ - జెస్సి పాత్రలకు అక్కినేని కపుల్స్ ను తప్ప మరొకరిని ఉహించుకోలేము. మరీ దర్శకుడు గౌతమ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.