Asianet News TeluguAsianet News Telugu

జూనియర్ యష్ ఆగయా.. KGF ఫ్యాన్స్ సెలబ్రేషన్స్

నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో యష్ ఇంట్లోకి వారసుడొచ్చాడు. యష్ సతీమణి రాధికా పండిట్‌ పండంటి మెగా బిడ్డకు జన్మనిచ్చింది. బెంగుళూరులోని ప్రయివేట్ హాస్పిటల్ లో గత రెండు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో రాధికాను ఉంచారు. ఇక బుధవారం ఉదయం కొడుకు జన్మించినట్లు యష్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

yash radhika pandit blessed with a baby boy
Author
Hyderabad, First Published Oct 30, 2019, 1:32 PM IST

KGF సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో యష్ ఇంట్లోకి వారసుడొచ్చాడు. యష్ సతీమణి రాధికా పండిట్‌ పండంటి మెగా బిడ్డకు జన్మనిచ్చింది. బెంగుళూరులోని ప్రయివేట్ హాస్పిటల్ లో గత రెండు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో రాధికాను ఉంచారు.

ఇక బుధవారం ఉదయం కొడుకు జన్మించినట్లు యష్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.  ఇప్పటికే యష్ కి ఒక కూతురి జన్మించింది. గత ఏడాది జన్మించిన ఆ పాపకు ఐరా అని పేరు కూడా పెట్టారు. 11 నెలల ఐరాతో యష్ దిగిన స్పెషల్ ఫొటోస్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు వారి కుటుంబంలోకి మరో వారసుడు వస్తుండడంతో యష్ కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి.

yash radhika pandit blessed with a baby boy

యష్ అభిమానులు కూడా దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  2016లో నటి రాధికా పండిట్‌ ని ప్రేమ వివాహం చేసుకున్న యష్ అప్పటి నుంచి తన రేంజ్ ని పెంచుకుంటూ వస్తున్నాడు. భార్య రాకతో KGF లాంటి భారి హిట్ అందుకున్నాడు.

yash radhika pandit blessed with a baby boy

ఇక ఏడాది వ్యవధిలో ఇద్దరు వారసులు యష్ లైఫ్ లోకి ప్రవేశించారు.  ప్రస్తుతం KGF సెకండ్ ఛాప్టర్ తో బిజీగా ఉన్న యాష్ ఆ ప్రాజెక్ట్ ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తేనున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios