రేసుగుర్రం - కిక్ - టెంపర్ వంటి బాక్స్ ఆఫీస్ కథలను అందించిన సీనియర్ రైటర్ వక్కంతం వంశీ గత కొంత కాలంగా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించడం లేదు. కిక్ 2 డిజాస్టర్ తరువాత తను రాసుకున్న కథలను సొంతంగా తెరకెక్కించాలని అనుకున్న వంశీ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు.

సినిమా డిజాస్టర్ కావడంతో వక్కంతం వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆ మధ్య ఒక కన్నడ హీరోతో సినిమా చేయడానికి సిద్దమవుతున్నట్లు టాక్ వచ్చింది కానీ అఫీషియల్ ఎనౌన్న్మెంట్ అయితే రాలేదు. ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం.. వంశీ అల్లు అరవింద్ ప్రొడక్షన్ లోనే ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్.

 

కొడుక్కి డిజాస్టర్ ఇచ్చినప్పటికీ తండ్రి అల్లు అరవింద్ సలహా మేరకు ఒక మంచి కథను సిద్ధం  చేసుకున్న వంశీ కుర్రహీరోతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ కుర్ర హీరో ఎవరనేది ఇంకా తెలియలేదు. నా పేరు సూర్య అనంతరం వక్కంతం వంశీతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపలేదు.  ఇక అల్లు అరవింద్ ఆదరించి చిన్న బడ్జెట్ లో ఒక సినిమా చేయమని చెప్పారట.

'సైరా' చూడరని చిరుకి ముందే చెప్పా కానీ.. నటుడు గిరిబాబు కామెంట్స్!

ఇంతకుముందు డైరెక్టర్ పరశురామ్ కి కూడా ఇలాంటి అఫర్ నే ఇవ్వగా గీతాగోవిందం సినిమా చేసి ఆ దర్శకుడు సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో వంశీ అల్లు అరవింద్ అఫర్ ని అందుకుంటున్నాడు. అందుకు ఒప్పుకున్న వంశీ అన్ని ప్లాన్స్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్న్మెంట్ వెలువడనుంది.