ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్‌ అధనమ్‌ గేబ్రియేసెస్‌ మెగా కోడలు, రామ్ చరణ్‌ సతీమణి ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు. `వరల్డ్‌ హెల్త్‌ డే చాలెంజ్‌ సందర్బంగా ఉపాసన కొణిదెల మా #ThanksHealthHeroes కార్యక్రమంలో భాగమైనందుకు నా ధన్యవాదాలు.  ప్రస్తుతం కోవిడ్‌ 19పై పోరాటంలో భాగంగా ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైధ్యులు, నర్సులకు కృతజ్ఞతలు` అంటూ ట్వీట్ చేశాడు టెడ్రోస్‌.

ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్‌ ఆర్గనైజేషన్‌  #ThanksHealthHeros అనే హ్యాష్‌ట్యాగ్‌ తో వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా ఉపాసన స్పందించి కరోనా పోరాటంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న సిబ్బందికి థ్యాంక్స్ చెపుతూ ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేసింది. ఈ వీడియోను డబ్ల్యూహెచ్‌ఓ తో పాటు టెడ్రోస్‌, తెలంగాణ సీఎంఓలకు ట్యాగ్ చేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్‌కు చెందిన హెల్త్‌ కేర్‌ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అంతేకాదు ఓ హెల్త్‌ మేగజైన్‌ కూడా నడిపిస్తున్న ఉపాసన సోషల్ మీడియా వేదిక ఫాలోవర్స్‌ హెల్త్‌ టిప్స్‌ ఇస్తుంటుంది. పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ భాగం పంచుకున్న ఆమెకు గత ఏడాది మహాత్మా గాంధీ అవార్డును సైతం అందుకుంది. కరోనా ప్రబలుతున్న సందర్భంగా ప్రజలు ఎలాంటి డైట్‌ పాటించాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాల్లోనూ అవగాహన కల్పిస్తోంది ఉపాసన.