‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎంతొస్తే సేఫ్!
నాలుగు రోజుల క్రితం వరకూ ఈ సినిమాకు సరైన బజ్ క్రియేట్ కాలేదు.కానీ విజయ దేవరకొండ సినిమాకు ఉన్న క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. నిర్మాత సైడ్ నుంచి ప్రమోషన్స్ పెద్దగా లేకపోయినా ఈ సినిమా టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్ అందరికీ షాక్ ఇచ్చింది. ప్రతీ చోటా దాదాపు హౌస్ ఫుల్ పరిస్దితి నెలకొంది.
క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. గత చిత్రం `డియర్ కామ్రేడ్` ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోకపోవటంతో అందరి దృష్టీ ఈ సినిమాపైనే ఉంది.
నాలుగు రోజుల క్రితం వరకూ ఈ సినిమాకు సరైన బజ్ క్రియేట్ కాలేదు.కానీ విజయ దేవరకొండ సినిమాకు ఉన్న క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. నిర్మాత సైడ్ నుంచి ప్రమోషన్స్ పెద్దగా లేకపోయినా ఈ సినిమా టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్ అందరికీ షాక్ ఇచ్చింది. ప్రతీ చోటా దాదాపు హౌస్ ఫుల్ పరిస్దితి నెలకొంది.
'ఏందే నీ యవ్వ గారు గారు అంటున్నావ్'.. హీరోయిన్ తో విజయ్ దేవరకొండ
ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ట్రేడ్ లో పెద్ద చర్చే జరుగుతోంది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 30.50 కోట్లు బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్ల బిజినెస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. విజయదేవరకొండ కెరీర్ లో సెకండ్ హైయిస్ట్ బిజినెస్ ఇది. డియర్ కామ్రేడ్ చిత్రం 34 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఏరియావైజ్ చూస్తే..
నైజాం – 9 Cr
సీడెడ్ – 4 Cr
ఆంధ్రా – 10 Cr
ఆంధ్రా/తెలంగాణా మొత్తం – 23 Cr
భారత్ లో మిగతా ప్రాంతాలు – 4 cr
ఓవర్ సీస్ – 3.5 cr
ప్రపంచవ్యాప్తంగా మొత్తం బిజినెస్ – 30.5 Cr
శాటిలైట్ రైట్స్ – 7 Cr
డిజిటల్ రైట్స్ – 5 Cr
హిందీ రైట్స్ – 8 cr
నిర్మాతకు ఈ మొత్తం సేఫే. అయితే ఇది విజయ్ దేవరకొండకు ఇప్పుడున్న పరిస్దితుల్లో పెద్ద టాస్కే. ఈ సినిమాని ఆశించిన మేరకు ప్రమోషన్స్ జరగటం లేదు. విజయ దేవరకొండ మాత్రమే దీన్ని రెండు రోజులుగా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్పించి పెద్దగా ప్రమోషన్స్ లేకపోవటం అభిమానులను నిరాశపరుస్తోంది. ముఖ్యంగా గీతా గోవిందం తరహాలో పాటలు ఛాట్ బస్టర్ కాలేదు. అందుకే ఈచిత్ర విజయం ఆయనకి కీలకం.
ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్ కాగా.. కేథరిన్ థ్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఎజిబెల్లా మరో ముగ్గురు హీరోయిన్లు. ఇలా నలుగురు హీరోయిన్ల చుట్టూ తిరగే కథ కాబట్టి దీనికి ఈ టైటిల్ పెట్టారని తెలుస్తోంది. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావడంతో ఈ చిత్రం విజయ్ కెరీర్‌కు కీలకంగా మారింది. మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు సినిమా తర్వాత సరైన సక్సస్ లేని క్రాంతి మాధవ్.. ఈ సినిమాతో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు.
కేయస్ రామారావు సమర్పణలో కేయస్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) రిలీజ్ చేస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ విభిన్నమైన లుక్స్‌తో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్.