Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దేవరకొండపై ఒత్తిడి.. నష్టం భరించాల్సిందే?

హీరోలకు సినిమా హిట్,ప్లాఫ్ లకు సంభంధం ఉండేది కాదు. కానీ సినిమా బడ్జెట్ లో ఎక్కువ షేర్ ..రెమ్యునేషన్ గా తీసుకోవటం మొదలెట్టాక...సీన్ రివర్స్ అయ్యింది. సినిమా ప్లాఫ్ అయితే నిర్మాత చేతులెత్తేసి..హీరో వైపు వేలు చూపిస్తున్నాడు. దాంతో పంపిణీదారులు ...తమ నష్టాలను పూడ్చమంటూ హీరోలపై ఒత్తిడి తేవటం మొదలైంది. 

World Famous Lover :Vijay Devarakonda compensate Losses?
Author
Hyderabad, First Published Feb 18, 2020, 7:46 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఇంతకు ముందు రోజుల్లో హీరోలకు సినిమా హిట్,ప్లాఫ్ లకు సంభంధం ఉండేది కాదు. కానీ సినిమా బడ్జెట్ లో ఎక్కువ షేర్ ..రెమ్యునేషన్ గా తీసుకోవటం మొదలెట్టాక...సీన్ రివర్స్ అయ్యింది. సినిమా ప్లాఫ్ అయితే నిర్మాత చేతులెత్తేసి..హీరో వైపు వేలు చూపిస్తున్నాడు. దాంతో పంపిణీదారులు ...తమ నష్టాలను పూడ్చమంటూ హీరోలపై ఒత్తిడి తేవటం మొదలైంది. రజనీకాంత్ తో మొదలైన ఈ ట్రెండ్ తెలుగులోనూ చాలా మంది హీరోల దాకా పాకింది.

ఎక్కువ రేటు పెట్టి కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు...నిర్మాత తమ తర్వాత సినిమా ఫ్రీగానో లేక తక్కువ రేటుకు ఇస్తామని హామీ ఇచ్చి సెటిల్ చేసుకుంటారు.  కానీ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ పరిస్దితి వేరు. ఎప్పుడో పెళ్లి చూపులు హిట్ అయ్యినప్పుడు అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత ఈ సినిమా  కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూసారు నిర్మాత కె.ఎస్ రామారావు.

చిరంజీవితో ఎన్నో హిట్స్ ఇచ్చిన ఈ సీనియర్ నిర్మాత...ఇప్పుడున్న పరిస్దితుల్లో సినిమా కష్టమని తెలిసినా...విజయ్ దేవరకొండ అడిగినంత భారీ మొత్తమే ఇచ్చి సినిమా ప్రారంబించారు. అయితే అనుకున్న స్దాయిలో ఈ సినిమా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. మెల్లిమెల్లిగా దర్శకుడుకు, హీరోకు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ లు మొదలయ్యాయి. ఓ స్టేజీలో విజయ్ దేవరకొండనే కొన్ని ఎపిసోడ్స్ డైరక్ట్ చేసారని వినికిడి. మెల్లిమెల్లిగా ఫైనాన్స్ కంట్రోలు సైతం తప్పింది నిర్మాతకు.  ఇవన్నీ చూస్తూ , ఎన్ని ఇబ్బందులు ఎదురైనా  ప్రాజెక్టు ప్రక్కకు వెళ్లకుండా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేసారీ నిర్మాత. మంచి ఓపినింగ్సే వచ్చాయి అనుకుని ఆనందపడేలోగా కలెక్షన్స్ డ్రాప్ రెండో రోజుకే మొదలైపోయింది.

మొదటే విజయ్ దేవరకొండ తన రెమ్యునేషన్ తీసుకుని బయిట పడ్డారు. ఇప్పుడు కెఎస్ రామారావు పరిస్దితి ఏమిటి అంటే భారీ లాస్ అని తేలింది. ఈ నేపధ్యంలో విజయ్ దేవరకొండ ముందుకు వచ్చి ఈ నష్టాల్లో కొంత అయినా భరిస్తే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్స్ సంప్రదిస్తున్నారట. అయితే విజయ్ దేవరకొండ మాత్రం ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో చేస్తున్న ఫైటర్ షూటింగ్ లో బిజిగా ముంబైలో ఉన్నారు. ఇదొక వివాదంగా మారకముందే సెటిల్ చేసుకోవటం మంచిదని ఇండస్ట్రీ జనం అంటున్నారు.

మరి ఏ టర్న్ తీసుకోబోతోందో చూడాలి.   ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్ కాగా.. కేథరిన్ థ్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఎజిబెల్లా మరో ముగ్గురు హీరోయిన్లు.  డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావడంతో ఈ చిత్రం విజయ్ కెరీర్‌కు కీలకంగా మారింది. మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు సినిమా తర్వాత సరైన సక్సస్  లేని క్రాంతి మాధవ్.. ఈ సినిమాతో ఫామ్‌లోకి రావాలని చూసారు. కానీ ఇద్దరి అంచనాలు తల క్రిందులు అయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios