టాలీవుడ్ రౌడి బాయ్ విజయ్ దేవరకొండ న్యూ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్' నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా మొదటిసారి రౌడి బాయ్ నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఇక అమెరికాలో సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ అందుతోంది.

దర్శకుడు క్రాంతి మాధవ్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా డిఫరెంట్ అని చెప్పాలి. 'ఓనమాలు - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' వంటి సినిమాలు చేసిన క్రాంతి ట్రెండ్ కి తగ్గట్టుగా విజయ్ తో డిఫరెంట్ స్టోరీని తెరకెక్కించాడు. వరల్డ్  ఫేమస్ లవర్ అనే లైన్ కి తగ్గట్టుగా తనదైన శైలిలో నాలుగు ప్రేమ కథల్ని తెరకెక్కించాడు. విజయ్ కూడా నాలుగు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలను అద్భుతమైన నటనతో ప్రెజెంట్ చేశాడు.

కథలో ట్విస్ట్ కి తగ్గట్టుగా పాత్రలను సన్నివేశాల్ని హైలెట్ చేసిన విధానం బావుంది. ఫస్ట్ హాఫ్ లో సినిమా అక్కడక్కడా బోర్ అనిపించినా సెకండ్ హాఫ్ లో మంచి ఎంటర్టైన్మెంట్ తో నడుస్తుంది. రాశి ఖన్నా మొదటిసారి తన పాత్రతో పెద్ద సాహసం చేసింది. ఇంగ్లీష్ బ్యూటీ ఇజాబెల్లే రోల్ కూడా కొత్తగా ఉంది. ఇక ఐశ్వర్య రాజేష్ ఓ వైపు సింపుల్ హౌస్ వైఫ్ లా కనిపిస్తూనే.. మరోవైపు గ్లామర్ ఘాటును కూడా సింపుల్ గా ప్రజెంట్ చేసింది.

మరొక హీరోయిన్ క్యాథెరిన్ కూడా తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. ఎమోషన్స్ విషయంలో దర్శకుడు మరొకసారి సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. సినిమాలో విజయ్ ఒక కార్మికుడిగా కనిపించిన విధానం మెయిన్ హైలెట్. మొత్తంగా వరల్డ్ ఫేమస్ లవర్ తో మరొక ప్రయోగం చేశాడని చెప్పవచ్చు. మరి సినిమా కమర్షియల్ గా ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.