ప్రేమికుల దినోత్సవం రోజు ప్రేక్షకులను పలకరించడానికి విజయ్‌ దేవరకొండ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే . క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం థియోటర్ రైట్స్ ని చదలవాడ శ్రీనివాసరావు 24 కోట్లు కు తీసుకోవటానికి ఎగ్రిమెంట్ చేసుకున్నారు. అందునిమిత్తం నాలుగు కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం.  అయితే ఫిల్మ్ నగర్  వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు చెప్పారట.

అలాగే అడ్వాన్స్ ఇప్పుడే తిరిగి ఇవ్వక్కర్లేదని బిజినెస్ అయ్యాక ఇవ్వమని అన్నారట. అయితే అంత అర్జెంటుగా ఈ ప్రాజెక్టు నుంచి చదలవాడ వెనక్కి వెళ్లటానికి కారణం..కేవలం ఈ  ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా తీసుకుంటామంటూ ఆంధ్రానుంచి  బిజినెస్ ఎంక్వైరీలు రాకపోవటమే అని చెప్తున్నారు. ఈ నేపధ్యంలో నిర్మాత కెఎస్ రామారావు ఈ సినిమాకు బయర్లు ని వెతికే పనిలో  ఉన్నారట. సోలో బయ్యర్ కనుక దొరకకపోతే ఏరియా వైజ్ గా బిజినెస్ చేస్తారట. అయితే ఈ వార్త లో ఎంత వరకూ నిజముంది అనే విషయం తెలియాల్సి ఉంది.

లేటెస్ట్‌గా వచ్చిన విజయ్ దేవరకొండ చిత్రం  'డియర్ కామ్రేడ్' డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం, కొత్త డైరెక్టర్‌తో మొదలుపెట్టిన 'హీరో' సినిమా సరిగా రాక దాన్ని మధ్యలో ఆపెయ్యడం లాంటి పరిణామాలు, ఈ సినిమాకు ఇంకా పబ్లిసిటీ ప్రారంభించకపోవటం కూడా సినిమాపై ఇంట్రస్ట్ క్రియేట్ చేయలేకపోయాయని చెప్తున్నారు.

ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్ కాగా.. కేథరిన్ థ్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఎజిబెల్లా మరో ముగ్గురు హీరోయిన్లు. ఇలా నలుగురు హీరోయిన్ల చుట్టూ తిరగే కథ కాబట్టి దీనికి ఈ టైటిల్ పెట్టారని తెలుస్తోంది. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావడంతో ఈ చిత్రం విజయ్ కెరీర్‌కు కీలకంగా మారింది. మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు సినిమా తర్వాత సరైన సక్సస్  లేని క్రాంతి మాధవ్.. ఈ సినిమాతో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు.

కేయస్‌ రామారావు సమర్పణలో కేయస్‌ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం  షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తోంది చిత్రం టీమ్. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇందులో విజయ్‌ దేవరకొండ విభిన్నమైన లుక్స్‌తో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌.