రౌడీ బాయ్ గా స్పెషల్ క్రేజ్ అందుకుంటున్న యువ హీరో విజయ్ దేవరకొండ గత శుక్రవారం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది డియర్ కామ్రేడ్ సినిమాతో  అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

కానీ సినిమా ఆడియెన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. ముందు నుంచే సినిమాకు అనుకున్నంతగా బజ్ అయితే క్రియేట్ కాలేదు. సినిమా రిజల్ట్ పై క్లారిటీ రావడానికి ఎంతో సమయం కూడా పట్టలేదు. లోకల్ గానే కాకుండా యూఎస్ లో కూడా సినిమా కలెక్షన్ బాగా తగ్గుతున్నాయి. సినిమాకి హిట్ టాక్ తప్పనిసరి అవసరం అనుకున్న సమయంలో నెగిటివ్ టాక్ చాలా వేగంగా స్ప్రెడ్ అయ్యింది.

యూఎస్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. శుక్రవారం $63,114 డాలర్స్ అందుకున్న ఈ సినిమా వీకెండ్ లో పెద్దగా ప్రభావం చూపడం లేదు. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం రౌడీ బాయ్ $174,155ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించినట్లు సమాచారం. ఆదివారం కలెక్షన్స్ డోస్ పెరుగుతుందేమో చూడాలి. ఇదే ఫ్లోలో కొనసాగితే సినిమా బయ్యర్స్ భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి ఖన్నా - ఇజాబెల్లా - క్యాథెరిన్ - ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు.