Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దేవరకొండ ఎఫెక్ట్.. పూరి జగన్నాథ్ కి వార్నింగ్!

వివరాల్లోకి వెళితే..ఇదే త‌న చివ‌ర ప్రేమ‌క‌థా చిత్ర‌మంటూ ప్రేమికుల‌రోజైన ఫిబ్ర‌వ‌రి 14న `వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు విజయ్ దేవరకొండ.  

WORLD FAMOUS LOVER: Distributors warning to Puri jagan
Author
Hyderabad, First Published Feb 29, 2020, 9:44 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఓ సినిమా ప్లాఫ్ అయితే ఇంతకు ముందులా డిస్ట్రిబ్యూటర్స్ ఊరుకోవటం లేదు. తాము పెట్టుబడి పెట్టిన డబ్బుని వెనక్కి ఇవ్వమని పట్టుబడుతున్నారు. అందుకోసం హీరోను, నిర్మాతను బెదిరిస్తున్నారు. ఒత్తిడి తెస్తున్నారు. వార్నింగ్ లతో తమ డబ్బుని వెనక్కి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కు అలాంటి సిట్యువేషనే ఎదురౌతోంది. ఇండస్ట్రి అంతర్గతవర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...డిస్టిబ్యూటర్స్ తమ విషయం సెటిల్ చేయమని విజయ్ కు అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే పూరి జగన్ కు సైతం ఈ విషయం త్వరగా తేల్చకపోతే నీ సినిమా రిలీజ్ కష్టమవుతుందని చెప్పారట.

వివరాల్లోకి వెళితే..ఇదే త‌న చివ‌ర ప్రేమ‌క‌థా చిత్ర‌మంటూ ప్రేమికుల‌రోజైన ఫిబ్ర‌వ‌రి 14న `వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు విజయ్ దేవరకొండ.  అయితే అందరూ ఎక్సపెక్ట్ చేసినట్లుగానే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. హీరో, నలుగురు హీరోయిన్స్‌తో చేసిన రొమాన్స్ ఏదీ జనాలకు పట్టలేదు.  చివ‌ర‌కు ఈ ప్రేమ‌క‌థా చిత్రం ద్వారా ఏం చెప్పాల‌నుకున్నాడు?  అనే విష‌యం క్లారిటీ రాలేదు. ఇవన్నీ కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపించాయి.

అయితే విజయ్ కు ఉన్న క్రేజ్ తో ఈ సినిమా మొదటి రోజు 9 కోట్లు గ్రాస్ వచ్చింది. అయితే ఆ తర్వాత మెల్లిగా డ్రాప్ స్టార్టైంది. వీకెండ్ కూడా పికప్ కాలేదు. ఇక నెక్ట్స్ వీక్ రిలీజైన భీష్మ దెబ్బకు ఈ సినిమా పూర్తిగా థియోటర్స్ నుంచి మాయిమైపోయింది. దాంతో ట్రేడ్ వర్గాల వేసిన అంచనా ప్రకారం... 70%  దాకా లాస్ వచ్చింది. అంటే దాదాపు 20 కోట్లు దాకా లాస్ వచ్చినట్లే. దీంతో నిర్మాత‌తో పాటు డిస్ట్రిబ్యూట‌ర్లు కూడా భారీగా న‌ష్టాల‌ు వచ్చాయి.

ముఖ్యంగా సునీల్ నారంగ్‌, అభిషేక్ అగ‌ర్వాల్ భారీగా న‌ష్ట‌పోయార‌ని సమాచారం. దీంతో నిర్మాత కె.ఎస్‌. రామారావుని మీటింగ్ కు  పిలిచి రిక‌వ‌రీ ప‌రిస్థితి ఏంట‌ని అడిగార‌ట‌. ఈ విషయంలో తానేమీ చేయ‌లేన‌ని, దీనికంత‌టికి విజ‌య్ దేవ‌ర‌కొండ‌నే కార‌ణ‌మ‌ని క్లియర్ గా క్లారిటీ ఇచ్చేసారట. నష్టపోయింది రూపాయి రెండు కాదు కోట్లు కావటంతో...న‌ష్టపోయిన  డిస్ట్రిబ్యూటర్స్ అంతా పూరి జ‌గ‌న్నాథ్‌తో పాటు విజ‌య్‌కి ఓ లెట‌ర్ పంపిన‌ట్టు సమాచారం. మా రికవరీ సంగ‌తి తేలిస్తేనే మీ సినిమా రిలీజ్ అవుతుంద‌ని, లేదంటే నైజాంలో రిలీజ్ కానివ్వ‌మ‌ని వార్నింగ్ ఇచ్చారట. దాంతో పూరి జగన్నాథ్...అటు పోయి..ఇటు పోయి తన మెడకు చుట్టుకుందేమిటని తల పట్టుకున్నాడట.

Follow Us:
Download App:
  • android
  • ios