ప్రతీ పెద్ద సినిమాకు కలెక్షన్స్ అఫీషియల్ గా ప్రకటించటం అనేది ఆనవాయితీగా మారిపోయింది. మొదట రోజు నుంచే ఇదో ఉత్సవంలాగ జరిపిస్తూంటారు. కలెక్షన్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేయటం, వాటిని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయటం జరుగుతోంది. అయితే చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా కలెక్షన్స్ ని మాత్రం నిర్మాతగా రామ్ చరణ్ రివీల్ చేయటానికి ఇష్టపడటం లేదు.  దాంతో మెగా ఫ్యాన్స్  ...ఇలా చరణ్ చేస్తున్నాడేంటి అనుకుంటున్నారు. అందుకు కారణం ఏమిటనేది మీడియాలో చర్చగా మారింది.

అందుతున్న సమాచారం మేరకు  రంగస్దలం తర్వాత రామ్ చరణ్ తన చిత్రం కలెక్షన్స్ ఫేక్  చేయటం, ఎక్కువ చేసి ప్రకటించటం వంటివిచేయకూడదని నిర్ణయించుకున్నారు. దాన్నే  ఓ నిర్మాతగా తన సైరా చిత్రానికి సైతం పాటిస్తున్నారు. సైరా నరసింహారెడ్డి మొదటి రోజే భాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే కొణిదెల ప్రొడక్షన్స్  వాళ్లు ఈ విషయమై ఏ విధమైన ప్రకటన చేయలేదు. అయితే వెబ్ మీడియా వస్తున్న కథనాలను, కలెక్షన్స్ ను ఆధారం చేసుకుని అభిమానులు కలెక్షన్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే అఫీషియల్ గా సంస్ధ నుంచి, నిర్మాత నుంచి వచ్చిన కలెక్షన్స్ ని ప్రచారం చేస్తే బాగుంటుందని వారు అభిప్రాయ పడుతున్నారు.
 
 ఐదు భాషలలో విడుదలైన సైరా తెలుగులో మరియు సౌత్ లాంగ్వేజ్ లలో మంచి ఆదరణ దక్కించుకోగా హిందీలో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. కారణాలేమైనా కానీ సైరా హిందీ వర్షన్ ప్లాఫైంది. ప్యాన్ ఇండియా సినిమాగా వర్కవుట్ కాలేదు. కానీ తెలుగు సినిమాగా మాత్రం ప్రశంసలు అందుకుంటోంది.