చిరంజీవి ప్రస్తుతం బ్యాంకాక్ లో ఉన్నారు. అలాగని ఆయన తన తాజా చిత్రం షూటింగ్ కోసం వెళ్లలేదు. మరి దేనికోసం వెళ్లారు. ఏదన్నా ఏదన్నా బాడీ షేప్ కోసం ప్లాన్ చేస్తున్నారా లేక సినిమా లొకేషన్స్ స్కౌటింగ్స్ కోసం వెళ్లారా అంటూ రకరకాల రూమర్స్ మొదలయ్యాయి. అయితే వాటిల్లో నిజమేమీ లేదు.   బ్యాంకాక్  లో చిరంజీవి, మణిశర్మ, కొరటాల శివ కలిసి మ్యూజిక్ సిట్టింగ్ లలో పాల్గొంటున్నారు. చిరంజీవి చాలా యాక్టివ్ గా ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారు. ఒక్కసారి ట్యూన్స్ అన్నీ ఫైనల్ అయ్యాక ఇండియా వస్తారు.

‘సైరా నరసింహారెడ్డి’  తర్వాత  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సామాజిక సందేశంతో కూడిన సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస హిట్స్  డైరక్టర్  కొరటాల శివ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకు రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. వచ్చే సంవత్సరం ప్రారంభం నుంచి షూటింగ్  ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.  మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఈ చిత్రం సోషల్ మెసేజ్ గా కాకుండా ఓ కమర్షియల్ వెంచర్ డీల్ చేస్తున్నట్లే చేస్తున్నారట.  ఈ చిత్రం కోసం ఆర్ ఎఫ్ సి లో ఓ ప్రత్యేకమైన సెట్ వేస్తున్నారు.    ఈ సినిమాను వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మొదట అనుకున్నారు. అయితే ఇంకా షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో ఆగస్టు లేదా దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇంకా ఈ సినిమాకు పూర్తి స్థాయిలో కాస్టింగ్ కూడా పూర్తవలేదని తెలుస్తోంది.