ధనుశ్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన 'అసురన్' తమిళనాట భారీ విజయాన్ని నమోదు చేసింది. క్రితం నెల 4వ తేదీన విడుదలైన ఈ సినిమా, ధనుశ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.   వెంకటేశ్ హీరోగా సురేశ్ ప్రొడక్షన్స్ - కలైపులి థాను సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే సమస్య అంతా ఈ సినిమాకి దర్శకుడు దగ్గరే వచ్చినట్లు సమాచారం.  'రాజుగారి గది 3' దర్శకుడు ఓంకార్ కి 'అసురన్' తెలుగు రీమేక్ బాధ్యతలను అప్పగిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ అంత లేదని తేలిపోయింది..  

 సమాజంలోని అసమానతల గురించి సీరియస్ గా తీసిన సినిమా..కావటం,  అవార్డు విన్నింగ్ సినిమాల దర్శకుడు వెట్రి మారన్ కావటం.... ఆయన రేంజిలో తెలుగులో ఎవరు తీస్తారనే సమస్య ఎదురైంది. ఎవరు మొదలెట్టినా ఆ స్దాయి అందుకోపోతే పాడు చేసారంటారు. ఈ నేఫధ్యంలో రీసెంట్ గా  రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో ఒక 20 మంది యువ దర్శకులకి షో వేశారని తెలుస్తోంది.

సినిమా చూసి యాజిటీజ్ గా రీమేక్ చెయ్యగలమని ఎవరు ముందుకు వస్తే వారికి బాధ్యత అప్పగించాలని ప్లాన్ చేసారు నిర్మాతలు. ఈ సినిమాని ఈ యంగ్ డైరక్టర్స్ అందరు చూశారు. కానీ ఫైనల్ గా ఎవరు ముందుకొచ్చారనేది మాత్రం బయిటకు రాలేదు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్ పూర్తి అయ్యి రిలీజ్ కు రెడీగా ఉంది.  ఈ సినిమా పూర్తయిన వెంటనే అసురన్‌ రీమేక్‌ పనులు ప్రారంభించనున్నాడు.