సీనియర్ హీరో వెంకటేష్ తమిళంలో హిట్ అయిన 'అసురన్' సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి దర్శకుడిని ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఇండస్ట్రీలో పలువురు దర్శకులకు ఈ సినిమా కూడా చూపించారు. అందుబాటులో ఉంటే దర్శకుడు క్రిష్ తో, కుదరకపోతే హను రాఘవపూడితో సినిమా చేయాలని భావిస్తున్నారు.

అయితే ఈ మొత్తం వ్యవహారం ఓ వైపు ఇలా సాగుతుంటే.. మరోవైపు ఈ సినిమాకి జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతుంది. 'అసురన్' రీమేక్ అని చెప్పడంతో తెలుగు ప్రేక్షకులంతా ఇప్పుడు ఈ సినిమాని చూడడం మొదలుపెట్టారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులోకి రావడంతో.. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాని చూస్తున్నారు.

తెలుగు కమెడియన్స్ రెమ్యునరేషన్స్.. రోజుకి ఎంతంటే?

తమిళ సినిమా అయినప్పటికీ తెలుగు వాళ్లు కూడా ఈ సినిమాకి బాగానే చూస్తున్నారు. దీని వల్ల 'అసురన్' రీమేక్ కి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమాని ముందే చూడడం వలన కథ,  కథనం, క్లైమాక్స్ వంటి విషయాలు రిలీజ్ కి ముందే చాలా మంది ప్రేక్షకులకు తెలిసిపోతుంది.

అలానే ఒరిజినల్ సినిమాను చూడడం వలన రీమేక్ తో కంపారిజన్స్ వచ్చేస్తాయి. కేవలం వెంకీ, ధనుష్ నటన మధ్య పోలికలే కాకుండా.. ప్రేక్షకుల్లో పెరిగిన పరిజ్ఞానం కారణంగా  కెమెరా, డైరక్షన్ లాంటి విభాగాల్లో కూడా పోలికలు ఎంచడం ఎక్కువైపోతుంది. ఈ రీమేక్ ని చాలా మంది దర్శకులు ఒప్పుకోకపోవడానికి కారణం కూడా ఇదే.

తమిళంలో 'అసురన్' ఓ క్లాసిక్ అనిపించుకుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాని చూసినవారు కూడా అందులో ఎమోషన కి కనెక్ట్ అయ్యారు. అలాంటి సినిమాకి రీమేక్ అంటే సోల్ చెడిపోకుండా తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా తీయడమంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. మరి ఈ రీమేక్ ని డైరెక్ట్ చేయడానికి ఎవరు ముందుకొస్తారో చూడాలి!