Asianet News TeluguAsianet News Telugu

బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు.. గెలిచిందెవరు..?

నందమూరి బాలకృష్ణ 'రూలర్'తో పాటు సాయి తేజ్ నటించిన 'ప్రతిరోజు పండగే', అలానే కార్తి నటించిన 'దొంగ', సల్మాన్ ఖాన్ 'దబంగ్ 3' చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ నాలుగు చిత్రాల్లో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది..?

who is the winner: pratiroju pandage, ruler, donga, dabangg 3?
Author
Hyderabad, First Published Dec 21, 2019, 5:07 PM IST

చాలా రోజుల తరువాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. శుక్రవారం నాడు మొత్తం నాలుగు సినిమాలు ప్రేక్షలుల ముందుకు వచ్చాయి. నిజానికి ఇంత పోటీ మధ్యలో సినిమాలు రిలీజ్ చేయరు కానీ క్రిస్మస్ సీజన్ కావడంతో పోటీ తప్పనిసరైంది.

నందమూరి బాలకృష్ణ 'రూలర్'తో పాటు సాయి తేజ్ నటించిన 'ప్రతిరోజు పండగే', అలానే కార్తి నటించిన 'దొంగ', సల్మాన్ ఖాన్ 'దబంగ్ 3' చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ నాలుగు చిత్రాల్లో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది..? బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా విజేతగా నిలవబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎక్స్‌పోజింగ్‌ చేస్తే చూడట్లేదు.. లావణ్య త్రిపాఠి కామెంట్స్

ఈ నాలుగు చిత్రాలలో బాలయ్య 'రూలర్' సినిమాకి నెగెటివ్ టాక్ ఎక్కువగా వచ్చింది. బాలయ్య కెరీర్ లో ఇదొక చెత్త సినిమా అంటూ తేల్చేస్తున్నారు. మొదట నుండి ఈ సినిమాపై బజ్ లేకపోవడంతో జనాలు కూడా ఈ సినిమా నుండి పెద్దగా ఏదీ ఆశించలేదు. ఇక సాయి తేజ్ నటించిన 'ప్రతిరోజు పండగే' చిత్రానికి ఏవరేజ్ టాక్ వచ్చింది.

సినిమాలో కామెడీ వర్కవుట్ అయినా.. ఎమోషన్స్ జనాలకు కనెక్ట్ కాలేదు. కానీ పాజిటివ్ బజ్ కారణంగా సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. వీకెండ్ లో సినిమా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక డబ్బింగ్ చిత్రాల్లో 'దబంగ్ 3'ని మన జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. సినిమాకి కూడా సరైన టాక్ రాలేదు.

కంటెంట్ పరంగా కార్తి 'దొంగ' సినిమా జనాలను మెప్పిస్తోంది. కానీ పోటీ కారణంగా ఈ సినిమాకి తక్కువ థియేటర్లు దొరికాయి. దీంతో హైప్ లేకుండా పోయింది. ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మున్ముందు పుంజుకుంటుందేమో చూడాలి. ఇక ఈ నాలుగు చిత్రాల్లో బాక్సాఫీస్ విజేతగా 'ప్రతిరోజు పండగే' చిత్రాన్ని చెప్పుకోవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios