రామ్ చరణ్ తెలివైనవాడు. ఈ జనరేషన్ కుర్రాడు. ఎక్కడ డబ్బులు పెడితే..రెట్టింపు అయ్యి తిరిగి వస్తుందో తెలిసిన వాడు. అయితే ఒక్కోసారి ఆ లెక్కలు తప్పుతుంటాయి. సైరా విషయంలో అదే జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ విషయంలో చీదేసింది. దాంతో ఈ సారి ఆచి,తూచి అడుగులు వెయ్యాలని మరో రీమేక్ చిత్రం రైట్స్ తీసుకున్నారు. ఆ సినిమాకు సరైన హీరోని, డైరక్టర్ ని సెట్ చేసి,సెలైంట్ గా ప్రొడ్యూస్ చేసి హిట్ కొడదామనే ఆలోచనలో ఉన్నాడు.

అందులో భాగంగా మలయాళం సూపర్ హిట్ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ రైట్స్ ని రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా అక్కడ కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కి హీరోగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయం దగ్గర రామ్ చరణ్ ఆగినట్లు తెలుస్తోంది. తన ఫ్యామిలీ నుంచి మీడియం రేంజ్ హీరోగా ఉన్న సాయి ధరమ్ తేజ్ తో రీమేక్ చేసేందుకు రామ్ చరణ్ రైట్స్ సొంతం చేసుకున్నా...ఆ తర్వాత ఆలోచనలో పడినట్లు సమాచారం.

అమ్మకానికి రామానాయుడు స్టూడియోస్.. ప్లాట్స్ గా మార్పు?

ఈ సినిమా చూసిన వారంతా వెంకటేష్ లాంటి స్టార్, కామెడీ ఇమేజ్ ఉన్నవారైతైనే ఫెరఫెక్ట్ అని చెప్తున్నారట. దాంతో ఇప్పుడు సాయి ధరమ్ తేజ తో చేయాలా లేక వెంకటేష్ తో చేయాలా అనే డైలామోలో ఉన్నట్లు తెలుస్తోంది. సాయి తో అయితే రెమ్యునేషన్ మిగతా విషయాల్లో ఖర్చు తక్కువ పెట్టచ్చు. ఎంత కాదనుకున్నా వెంకటేష్ అనగానే బయిట హీరో...ఖచ్చితంగా అన్ని ఫెరఫెక్ట్ గా ఖర్చు పెట్టి చేయాల్సిందే.
 
అంతేకాదు దర్శకుడు అనీల్ రావిపూడి చేత ఈ చిత్రం రీమేక్ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో తీసుకున్నట్లు గా చెప్పుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ యాక్షన్ చిత్రం తర్వాత ...ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుందని రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయని,మళయాళీ చిత్రం బాగా నచ్చేసే తీసుకున్నట్లు రామ్ చరణ్ చెప్తున్నారట.

డిసెంబర్ 2019న రిలీజైన ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ లో చేసారు. జూ.లాల్ డైరక్ట్ చేసిన ఈ సినిమా మళయాళి పరిశ్రమలో డీసెంట్ హిట్ గా నమోదైంది. ఈ మధ్యనే లూసీఫర్ సినిమా రైట్స్ తీసుకున్న రామ్ చరణ్ మళ్లీ మరో మళయాళీ చిత్రం రైట్స్ తీసుకోవటంపై అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మళయాళి సినిమాలంటే రామ్ చరణ్ కు బాగా నచ్చుతున్నాయని, ముఖ్యంగా పృధ్వీరాజ్ సుకుమారన్ తో ఉన్న పరిచయం తో ఈ సినిమాలు తీసుకోవటం జరిగిందని అంటున్నారు.