బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఐదు పదుల వయసు దాటినప్పటికీ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. పెళ్లి అనే ఆలోచన కూడా చేస్తున్నట్లుగా అనిపించడం లేదు. గతంలో చాలా మంది హీరోయిన్లను డేటింగ్ చేసిన సల్మాన్.. వారిలో ఒకరిని పెళ్లి చేసుకుంటాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ రూమర్లుగానే మిగిలిపోయాయి.

ఇటీవల విదేశీ అమ్మాయితో కలిసి తిరగడం చూసి సల్మాన్ ఆమెని పెళ్లి చేసుకుంటాడనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ అది కూడా జరలేదు. అసలు సల్మాన్ కి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదని కొందరు అంటున్నారు. అసలు పెళ్లి గురించి సల్మాన్ ఏం అలోచిస్తున్నాడనే విషయంలో అభిమానులకు క్లారిటీ లేదు. నిజానికి సల్మాన్ కి ఈపాటికే పెళ్లి కావల్సిందట.

బాలకృష్ణ మళ్ళీ అదే ఫార్మాట్.. స్టైల్ ప్లస్ మాస్?

మరో ఐదు  రోజుల్లో పెళ్లి ఉందనగా.. సల్మాన్ క్యాన్సిల్ చేశాడట. ఈ విషయాలను ప్రముఖ దర్శకుడు, సల్మాన్ కి అత్యంత ఆప్తుడు సాజిద్ నడియాడ్ వాలా చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న సాజిద్ కి.. సల్మాన్ పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. 1999లో ఒక అమ్మాయితో సల్మాన్ పెళ్లి ఫిక్స్ అయిందట. అదే సమయంలో తన పెళ్లి కూడా కుదరడంతో ఇద్దరి పెళ్లిళ్లు ఒకే సమయంలో, ఒకే చోట చేయాలని తమ కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారని సాజిద్ వెల్లడించాడు.

పెళ్లి దగ్గర పడుతుండడంతో కార్డులు పంచడం, షాపింగ్ వంటి పనులు పూర్తి చేసుకున్నామని.. ఆ సమయంలో సల్మాన్ తనకు పెళ్లి ఇష్టం లేదని, ఆసక్తి లేదంటూ క్యాన్సిల్ 
చేయించాడని సాజిద్ వెల్లడించాడు.

ఆ సమయంలోనే సల్మాన్ పెళ్లి చేసుకొని ఉంటే ఈ సమయానికి అతడి పిల్లలు హీరోగా, లేదా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యేవారంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. అప్పటినుండి సల్మాన్ పెళ్లి విషయమే ఆలోచిస్తున్నట్లుగా లేడని సాజిద్ అన్నాడు. ప్రస్తుతం సల్మాన్ 'దబాంగ్ 3' సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.