సినిమాల షూటింగ్ సమయంలో సెట్ కి వచ్చి హీరో, హీరోయిన్లను కలిసి వెళ్లడం సినిమా ఇండస్ట్రీ వారికి సాధారణం విషయం. సెట్ లో అయితే షూటింగ్ గ్యాప్ లో ఈజీగా కలవొచ్చు.. ప్రత్యేకంగా ఎలాంటి అప్పాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.

కాబట్టి షూటింగ్ స్పాట్ కి వెళ్లి కలుస్తుంటారు. ఇలా కలవడంలో కొంతమందికి కొన్ని అవసరాలు, మరికొంతమందికి అర్ధం, పరమార్ధం ఉంటాయి.  అవి వేరే వ్యవహారాలు. ఇలాంటి ఓ వ్యవహారంతోనే సీనియర్ దర్శకుడు శ్రీనువైట్ల లొకేషన్ కి వెళ్లి మెగాస్టార్ చిరంజీవిని కలిసినట్లు తెలుస్తోంది.

'హిట్టు కొట్టి చాలా మందికి సమాధానం చెప్పావ్'.. నితిన్ సెటైర్ ఎవరిపై ?

వరుసగా ఫ్లాప్ లు ఇస్తూ వస్తున్నారు శ్రీనువైట్ల. సరైన బౌండ్ స్క్రిప్ట్ చేతిలో లేక, సొంత స్క్రిప్ట్ లు చేస్తుంటే సినిమాలు వర్కవుట్ కాక ఇబ్బంది పడుతున్నాడు శ్రీనువైట్ల. 'మిస్టర్' , 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలు చూస్తే పరిస్థితి ఏంటో అర్ధమవుతుంది.

ఈ నేపధ్యంలో శ్రీనువిట్లు సినిమా కోసమే మెగాస్టార్ ని కలిశారా..? లేక క్యాజువల్ గా కలిశారా..? అనేది తెలియదు. సినిమా ప్రయత్నాల్లో భాగంగానే శ్రీనువైట్ల.. మెగాస్టార్ ని కలిశారనే మాటలు వినిపిస్తున్నాయి.

బి.గోపాల్ కి బాలయ్య ఛాన్స్ ఇచ్చినట్లు.. శ్రీనువైట్లకి మెగాస్టార్ ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతం మెగాస్టార్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.