Asianet News TeluguAsianet News Telugu

#Animal: రణ్ బీర్ రెమ్యునేషన్ ఎంతంటే

ప్రాఫిట్ షేరింగ్ ఎగ్రిమెంట్ చేసుకున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ క్రమంలో ఈ సినిమా నిమిత్తం రణ్ బీర్ కు భారీ మొత్తమే అందనుంది.  

What about Ranbir Kapoor Remuneration For Animal jsp
Author
First Published Dec 4, 2023, 11:02 AM IST


బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌బీర్ - తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందిన పాన్ ఇండియా చిత్ర‌మే... ‘యానిమ‌ల్‌ (Animal movie)భాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతోంది.నార్త్,  సౌత్  తేడా లేకుండా ఈ సినిమా హవా కనిపిస్తోంది. మొదటిరోజు వరల్డ్ వైడ్ గా  మొదటి రోజు నుంచే  సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది.  వీసెండ్ లో  వచ్చిన కలెక్షన్స్ తో బాలీవుడ్లో ఇదివరకు ఉన్న రికార్డ్స్ అన్ని చల్లాచెదురు అయిపోయాయి.షారుక్ 'జవాన్' రికార్డ్ ని 'యానిమల్' బ్రేక్ చేసింది. ఈ నేఫధ్యంలో రణబీర్ కు ఎంత ఇచ్చారు ఈ సినిమాకు రెమ్యునరేషన్ గా అనేది హాట్ టాపిక్ గా మారింది. 

బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు .. ఈ సినిమాకు మామూలుగా అయితే 70 కోట్లు వరకూ తీసుకోవాలని అనుకుని ఎగ్రిమెంట్ చేసుకున్నారట. అయితే పోస్ట్ ప్రొడక్షన్ లో జరిగిన డిలే, కోవిడ్ తర్వాత పెరిగిన కాస్ట్ వీటితో బడ్జెట్ రెట్టింపు అవుతోందని భావించి తన రెమ్యునరేషన్ ని 50% వరకూ తగ్గించుకుని 30 - 35 కోట్ల వరకే తీసుకున్నారని తెలుస్తోంది. రణబీర్ మొదటి నుంచి తన సినిమాల విషయంలో క్రియేటివ్ గానే కాకుండా లిజిస్టిక్ యాస్పెక్ట్ లలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలోనే తగ్గించుకున్నాడని, అయితే ప్రాఫిట్ షేరింగ్ ఎగ్రిమెంట్ చేసుకున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ క్రమంలో ఈ సినిమా నిమిత్తం రణ్ బీర్ కు భారీ మొత్తమే అందనుంది.  
 
 ఈ చిత్రం ఫస్టాఫ్, ముఖ్యంగా ఇంట్రవెల్ అదిరిపోయింది..దానికి డబ్బులు ఇచ్చి వచ్చేయవచ్చు అంటున్నారు రణ్‌బీర్‌ను సందీప్‌ ఎంత వైల్డ్‌గా చూపించారనేదే హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై పెరిగిన ఎక్సపెక్టేషన్స్ కు తగినట్లుగా ఫస్ట్ డే ఓపినింగ్స్ సునామీలా వచ్చాయి.  
సాధారణంగా మాస్ సినిమాలకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బుకింగ్స్ బావుంటాయి. 'యానిమల్'కు మల్టీప్లెక్స్ థియేటర్లలో సైతం బావున్నాయి.  
 
యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మించారు.  టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయ్యింది. మితిమీరిన ర‌క్త‌పాతం, అస‌భ్యక‌ర‌మైన కొన్ని హావ‌భావాలు, విన‌లేని డైలాగులు ఇబ్బంది పెడ‌తాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios