Weekend Review: డబ్బింగ్ సినిమాలే దిక్కు!

బాక్సాఫీస్ వద్ద రెండు డబ్బింగ్ సినిమాలు సందడి చేశాయి. అందులో ఒకటి విజయ్ నటించిన 'విజిల్'. మరొకటి కార్తి 'ఖైదీ'. 

Weekend Review: dubbing films at tollywood box office

శుక్రవారం వచ్చిందంటే చాలు.. సినీ అభిమానులంతా ఏ సినిమా రిలీజ్ అయిందా అని బుక్ మై షో ఓపెన్ చేసుకొని చూస్తుంటారు. తమ అభిమాన హీరోలు వస్తున్నారంటే ముందు నుండే హడావిడి చేస్తుంటారు. చిరంజీవి 'సైరా' సినిమా తరువాత తెలుగులో మరో పెద్ద సినిమా రిలీజ్ కాలేదు.

గత వారం 'రాజుగారిగది 3', 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' వంటి సినిమాలు వచ్చాయి కానీ ఏవీ పెద్దగా ఆడలేదు. ఇక ఈ వారమైతే ఒక్క తెలుగు స్ట్రెయిట్ సినిమా కూడా లేదు. బాక్సాఫీస్ వద్ద రెండు డబ్బింగ్ సినిమాలు సందడి చేశాయి. అందులో ఒకటి విజయ్ నటించిన 'విజిల్'. మరొకటి కార్తి 'ఖైదీ'. 'విజిల్' సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. 

బాలయ్య 'రూరల్' పోస్టర్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

విజయ్ అభిమానులను ఈ సినిమా ఆకట్టుకుంది కానీ రెగ్యులర్ సినిమాలు చూసే ఆడియన్స్ ఏవరేజ్ సినిమాగా తేల్చేశారు. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'ఖైదీ' సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ కూడా ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. బాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన 'హౌస్ ఫుల్ 4'సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

Weekend Review: dubbing films at tollywood box office

ఇందులో పూజాహెగ్డే ఒక హీరోయిన్ గా నటించింది. ఇక తాప్సీ నటించిన 'శాండ్ కీ ఆంఖ్' సినిమాకి మాత్రం మంచి రివ్యూలతో పాటు ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఈ సినిమాతో తాప్సీ మరో హిట్టు సినిమా తన ఖాతాలో వేసుకుంది. వచ్చే వారంలో కూడా పెద్దగా సినిమాల హడావిడి ఉండదనిపిస్తుంది. డిసంబర్ వరకు సినిమా లవర్స్ కి తమ అభిమాన హీరోల కోసం ఎదురుచూడక తప్పదు!

Weekend Review: dubbing films at tollywood box office
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios