Asianet News TeluguAsianet News Telugu

మరికొద్ది రోజుల్లో పెళ్లి.. నూడ్ ఫొటోలు షేర్ చేసిన పాప్ సింగర్.. వైరల్ అవుతున్న పోస్ట్

హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ త్వరలో తన ప్రియుడితో పెళ్లి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా వరుసగా సోషల్  మీడియాలో నూడ్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది. ఇలాంటి పోస్ట్ లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Wedding in a few days, Pop singer who shared nude photos, Post going viral
Author
Hyderabad, First Published May 12, 2022, 2:36 PM IST

అమెరికన్ పాప్ సింగర్, సాంగ్ రటైర్ బ్రిట్నీ స్పియర్స్ (Britney Spears) అంటే తెలియని వాళ్లుండరు. ఆమె మధురమైన గానంతో ఎంతో అభిమానులను సంపాదించుకుంది. తన 15 ఏండ్ల నుంచి సింగర్ గా రాణిస్తోంది. ఈమెను ‘ప్రిన్సెస్ ఆఫ్ పాప్’ అని కూడా పిలుస్తారు. ఆమె 1990-2000ల మధ్య కాలంలో టీన్ పాప్ ఐకాన్‌గా పేరొందింది. స్పియర్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 మిలియన్ల రికార్డులను విక్రయించి అత్యధికంగా మ్యూజిక్ అమ్ముడైన సింగర్స్ లలో ఒకరిగా నిలిచింది. 

అయితే బ్రిట్నీ స్పియర్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నూడ్ ఫొటోలు  షేర్ చేస్తూ నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది. ఒంటిపై నూలిపోగు లేకుండా చేతులతో శరీరాన్ని దాస్తున్నట్టుగా ఉన్న ఫొటోను ఇటీవల ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. పూర్తిగా నగ్నంగా ఉన్న ఫొటోలను షేర్ చేయడం పట్ల నెటిజన్లులు అసహనానికి లోనవుతున్నారు. అయితే గతంలో తన ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయిన తొలినాళ్లలో నగ్నంగా దిగిన ఫొటోను పంచుకుంది. ఆ ఫొటోలకు ఇలా క్యాప్షన్ ఇచ్చింది. ‘నేను మెక్సికోలో ఉన్నప్పటి ఫొటో ఇది.. నా కడుపులో బేబీ ఉన్నాడు’ అని పేర్కొంది. 

ఏదేమైనా.. తన మాససిక పరిస్థితి సరిగ్గా లేనందువల్లే ఇలాంటి ఫొటోలను షేర్ చేస్తూదంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే బ్రిట్నీ స్పియర్స్ 13 ఏండ్ల పాటు తన తండ్రి సంరక్షణలోనే ఉంది. ఇటీవలే కోర్టు వరకు వెళ్లి విముక్తి పొందింది.  ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకున్న బ్రిట్నీ స్పియర్స్ వారి నుంచి గతంలోనే డివోర్స్ తీసుకుంది. ప్రస్తుతం తన ప్రియుడు సామ్ తో మ్యారేజ్ కు సిద్ధమైంది. వీరిద్దరూ 2016 నుంచి డేటింగ్ లో ఉన్నారు. ఇటీవలె బ్రిట్నీ స్పియర్స్ - సామ్ నిశ్చితార్థం పూర్తైంది. త్వరలో అమెరికన్ స్టైల్ లో పెళ్లి చేసుకోకున్నారు. ఇలాంటి సందర్భంలో బ్రిట్నీ స్పియర్ ఇలాంటి నూడ్ ఫొటోలను షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios