బాలీవుడ్ యాక్షన్ హీరోస్ టైగర్ ష్రాఫ్ -హృతిక్ రోషన్ మొత్తానికి దసరా బరిలో సాలిడ్ హిట్ అందుకున్నారు. వార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ స్టార్ హీరోల కెరీర్ లో అత్యధిక వేగంగా వందల కోట్ల కలెక్షన్స్ అందుకుంటున్న సినిమాగా వార్ నిలుస్తోంది.

రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం సినిమా వరల్డ్ వైడ్ గా 200గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్ కి ఏ సినిమా కూడా పోటీని ఇవ్వలేకపోయింది. చిచ్చేరే సైలెంట్ గా 150కోట్ల గ్రాస్ ని అందుకోగా జోకర్ మల్టిప్లెక్స్ లలో సత్తా చాటింది. ఆ సినిమాలు వార్ పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. బాక్స్ ఆఫీస్ వద్ద డబుల్ సెంచరీ బాదడంతో ఇక 300కోట్ల టార్గెట్ పెద్ద కష్టం కాదని తెలుస్తోంది.  మొదటి మూడు రోజుల్లోనే ఈ యాక్షన్ మూవీ 100కోట్ల మార్క్ ని అందుకుంది.

ఆ తరువాత ప్రతి రోజు మినిమమ్ 20కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఫైనల్ గా ఏడురోజుల్లో 200కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ సినిమాలో క్లిక్కవ్వడంతో అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇంకా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సినిమాకి మంచి వసూళ్లు దక్కే అవకాశం ఉంది. ఫైనల్ గా వార్ ఎంతవరకు రాబడుతుందో చూడాలి.