హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ మొదటిసారి కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ వార్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ మూవీ మొదటి ముడురోజుల్లోనే 100కోట్ల వసూళ్లతో షాకిచ్చింది. ఓ విధంగా హీరోల కెరీర్ లొనే బెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. 

ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం వార్ మొదటి 5 రోజుల్లో 150కోట్ల వసూళ్లతో మరోకొత్త రికార్డును క్రియేట్ చేసింది. నాలుగురోజుల్లో 128కోట్ల వద్ద ఉన్న ఈ సినిమా ఆదివారం అదిరిపోయే కలెక్షన్స్ ని అందుకుంది.సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించిన యష్ రాజ్ ఫిలిమ్స్ కి కూడా ఈ సినిమా ఒక రికార్డ్ ని అందించిందని చెప్పాలి.. గతంలో ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన నాలుగు సినిమాలు వేగంగా 150కోట్ల కలెక్షన్స్ ని సాధించాయి

వార్ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ లో కూడా మరింత లాభాలు అందుకునే అవకాశం ఉంది. పోటీగా పెద్ద సినిమాలు కూడా లేకపోవడం సినిమాకు కలిసొచ్చే అంశం. అయితే మల్టిప్లెక్స్ లలో హాలీవుడ్ జోకర్ సినిమా వార్ కు పోటీని ఇస్తోంది. అయినా కూడా వార్ వెనక్కి తగ్గడం లేదు. ఈ దసరా హాలిడేస్ సినిమ కలెక్షన్స్ కి బూస్ట్ ఇవ్వనున్నాయి.

సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వాణి కపూర్ హీరోయిన్ గా నటించింది. మొత్తానికి చాలా కాలం తరువాత టైగర్ ష్రాఫ్ ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఈ ఏడాది 'సూపర్ 30'తో సక్సెస్ అందుకున్న హృతిక్ ఇప్పుడు మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు