ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ హీరోగా పరిచయమవుతున్నారు. ఇంతకాలం డైరక్టర్ గా యాక్షన్ ...కట్ చెప్పిన వినయ్.. ఇప్పుడు వేరే దర్శకుడు యాక్షన్ చెప్తే, యాక్ట్ చెయ్యబోతునున్నారు. 'ఠాగూర్', 'ఖైదీ నెం:150' సినిమాల్లో కాసేపు తెరపై మెరిసిన వినాయక్‌ను పూర్తిస్థాయి హీరోగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ ద్వారా నిర్మాత దిల్ రాజు, లాంచ్ చేస్తున్నారు. ఈ రోజు (అక్టోబర్ 9)న వినాయక్ పుట్టినరోజు సందర్భంగా.. విషెష్  తెలుపుతూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఇంతకు ముందు ‘శరభ’ అనే చిత్రం డైరక్ట్ చేసిన ఎన్. నరసింహ  దర్శకత్వంలో ఈ ‘సీనయ్య’ (కంప్లీట్ ఎమోషన్) చిత్రం రూపొందుతోంది.  హీరో లుక్‌లో వినాయక్ పూర్తిగా స్లిమ్ గా మారి ఆశ్చర్యపరిచేలా ఉన్నాడు.  

త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రానికి ... స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు.  కెమెరా : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, మాటలు : డార్లింగ్ స్వామి, ఆర్ట్ : కిరణ్ కుమార్, నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి.